file photo శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్ గనిలో ఆదివారం ఉదయం జరిగిన ప్ర మాదంలో ఒక కార్మికుడు దుర్మరణం పాలవగా ముగ్...
| file photo |
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్ గనిలో ఆదివారం ఉదయం జరిగిన ప్ర మాదంలో ఒక కార్మికుడు దుర్మరణం పాలవగా ముగ్గురు ప్రాణపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ప్రమాదస్థలంలో ఉన్న కార్మికుల కథ నం ప్రకారం.. ఆర్కే న్యూటెక్ గనిలోని 1వ సీం 27వ లెవల్ నార్త్ 7ఏ డీప్ పనిస్థలంలో నలుగురు కార్మికులు షాట్‌వాల్ యంత్రం ట్రాన్స్‌పోర్టింగ్ పనులు చేస్తున్నారు. షాట్‌వాల్ యంత్రం ట్రాక్ నుంచి తప్పడంతో దాన్ని కార్మికులు తిరిగి ట్రాక్‌పైకి ఎక్కిస్తుండగా ఒక్కసారిగా ఒక పక్కకు పడిపోయింది.
ఈ ప్రమాదంలో ఇటికెల రాంనర్సయ్య (ఎంజేడబ్ల్యూ) కార్మికుడు షాట్‌వాల్ హైడ్రాలిక్ యంత్రంలో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెం దగా ఆక్కడ పనిచేస్తున్న గొట్టె రాజయ్య (ట్రామర్), యాకూబ్ (మజ్దూర్), భరిపాటి లచ్చన్న మజ్దూర్ కార్మికులు ప్రమాదం నుంచి స్వల్ప గా యాలతో తృటిలో తప్పించుకున్నారు. వెంటనే గనిమేనేజర్ మధుసూదన్ రావు, డీవైజీఎం జాన్ఆనంద్, సీజీఎం వెంకటేశ్వర్రావుకు సమాచారం ఇవ్వడంతో గనిపైకి చేరుకుని రెస్యూ సిబ్బంతో కలిసి ప్రమాద స్థలానికి చేరుకుని యంత్రంలో ఇ రుక్కున్న కార్మికుడిని బయటికి తసేలోగానే మృతిచెందాడని కార్మికులు పేర్కొన్నారు. మృతి చెందిన ఇటికల రాంనర్సయ్య కార్మికుడు గోదావరిఖని 8 ఇైంక్లెన్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇతనికి బార్య వజ్రమ్మ, తండ్రి నర్సయ్య, తల్లి లింగమ్మ, కూతుర పద్మ, కుమారుడు శ్రీకాంత్ ఉన్నారు.
సందర్శించిన నాయకులు
ఆర్కే న్యూటెక్ గనిలో జరిగిన ప్రమాద స్థలాని గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు పరిశీలించారు. టీబీజేకేస్ కేంద్ర ఉపాధ్యక్షుడు రవిందర్‌రెడ్డి, కార్యదర్శి గోవర్ధన్, బ్రాంచి ఉపాధ్యక్షుడు బండి రమేశ్, కార్యదర్శి పానగంటి సత్త య్య, మాజీ ఉపాధ్యక్షుడు బంటు సారయ్య, ఫిట్ కార్యదర్శి నర్సయ్య, ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి నర్సయ్య, హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షుడు పేరం రమేశ్, రీజియన్ కార్యదర్శి మంతెన మల్లేశం సం దర్శించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించా రు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రమాదానికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించి కార్మికుని కుటుంబానికి 20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు రక్షణ వారోత్సవా లు జరుగుతుంటే గనిప్రమాదం జరగడం శోచనీయమన్నారు. అధికారులు రక్షణ వారోత్సవాల్లో ఆర్బాటాలు తప్ప గనుల్లో రక్షణ చర్యలు తనిఖీ చేయడం లేదని ఆరోపించారు. ప్రమాదానికి బా ధ్యులైన అధికారులను తొలగించాలని డిమాండ్‌చేశారు. కార్మికుని మృతిపై విచారం వ్యక్తం చేసి సంతాపం తెలిపారు. కార్మికుని కుటుంబ సభ్యులకు సానుబూతిని ప్రకటించారు.
కుటుంబ సభ్యుల రోదనలు
గని ప్రమాదంలో మృతిచెందిన మల్టీజాబ్ వ ర్కర్ ఇటికెల రాంనర్సయ్య కుటుంబ సభ్యుల రోదనలతో గని ఆవరణలో విషాదం అలుముకుం ది. తన కొడుకు మృతివార్త తెలుసుకున్న తండ్రి నర్సయ్య, తల్లి లింగమ్మ, భార్య వజ్రమ్మ, కూ తుర పద్మ, కుమారుడు శ్రీకాంత్ గనిపై చేరి కార్మికుని మృతదేహం పైపడి రోదించడం కార్మికులను కలచివేసింది. తోటి కార్మికుడు నిన్నటి వరకు వారి తో పనిచేసి నేడు కానరాని లోకానికి వెల్లడంపై కార్మికులు కంటనీరు పెట్టుకున్నారు.
కార్మిక సంఘాల వాగ్వాదం
న్యూటెక్ గనిపై కార్మిక సంఘాల నాయకుల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీబీజీకేఎస్ నాయకులు ఏనుగు రవిందర్‌రెడ్డి, గోవర్దన్, బండి రమేశ్, మ్యాచింగ్గ్రాంట్కు జాతీయ కార్మిక సం ఘాలు సహకరించాలని కోరడంతో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వీరభద్రయ్య, ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు అన్నయ్య, కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, లింగారావులు మాట్లాడుతు గుర్తింపు కార్మిక సంఘ 20 లక్షల నష్టపరిహారం ఇప్పించాలని వాదనకు దిగా రు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తో తోపులాటకు దారి తీసింది. ఎస్ఐ సంజీవ్ జోక్యం చేసుకుని ఇరువర్గాలతో మాట్లాడారు. అనంతరం నాయకులు గనిమేనేజర్, సంక్షేమాధికారి కార్మికుల సమక్షంలోకి వచ్చి కార్మికుని మృతి గనిప్రమాదంగా గుర్తించినట్లుగా, నష్టపరిహారం పై, డిపెండెంట్ ఉద్యోగం నెలరోజుల్లోగా ఇవ్వడానికి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతోఅధికారులు హామీ ఇవ్వడంతో ఆం దోళన విరమించారు. అనంతరం కార్మికుని మృతదేహం స్థానిక ఏరియాస్పత్రికి తరలించారు.