సికింద్రాబాదులో రాత్రి సెక్స్ వర్కర్లు హల్ చల్ చేశారు. తాగిన మత్తులో జూనియర్ ఆర్టిస్టుపై మూకుమ్మడి దాడి చేశారు. సికింద్రాబాదు రైల్వేస్టే...
సికింద్రాబాదులో రాత్రి సెక్స్ వర్కర్లు హల్ చల్ చేశారు. తాగిన మత్తులో జూనియర్ ఆర్టిస్టుపై మూకుమ్మడి దాడి చేశారు. సికింద్రాబాదు రైల్వేస్టేషన్ లో మొదలైన వీరి వీరంగం గోపాలపురం పోలీస్ స్టేషన్ లోనూ కొనసాగింది. గురువారం రాత్రి జూనియర్ ఆర్టిస్ట్ శివకుమార్ గుంటూరు వెళ్లేందుకు సికింద్రాబాదు రైల్వే స్టేషన్ కు వచ్చాడు. టికెట్ తీసుకుని కౌంటర్ వద్ద ఉన్న పోలీస్ కంట్రోల్ రూం ముందు నిలబడి ఉన్నాడు. ఇంతలో ముగ్గురు మహిళలు ఆయన దగ్గరకు వచ్చి యాచించారు. అతడు కొంత చిల్లర ఇచ్చాడు. దాంతో ఆయన్ను కిందామీద చూసిన ఆ ముగ్గురు హీనా, మమత, ఆయేషాలు అతడిపై నానా హంగామా సృష్టించారు. జేబులో ఉన్న మొత్తం డబ్బును లాక్కోవాలని ప్రయత్నించారు. ఆ పరిణామంతో భయపడి పారిపోతున్న అతడిని వెంటాడారు. రాళ్లు చేతపట్టి అతడిపై దాడి చేశారు. దీంతో శివకుమార్ తలకు గాయాలయ్యాయి. అక్కడి ప్రయాణికులు ఈ తతంగాన్నంతా ప్రేక్షకుల్లా చూస్తూ నిలబడిపోగా, అటుగా వెళుతున్న గోపాలపురం పోలీసులు మహిళలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. స్టేషన్ లోనూ సదరు మహిళలు వీరంగం సృష్టించారు. పూలకుండీలు పగులగొట్టారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు… బట్టలిప్పేశారు.. అర్ధనగ్నంగా ప్రదర్శనలు చేసి పోలీసులే నివ్వెరపోయేలా చేశారు. సినిమా చూపించారు. ఈ సీన్ చూసిన పోలీసులూ నివ్వెరపోయారు. వారిని ఇలా ఉసిగొల్పుతున్న గ్యాంగ్‌లీడర్ చాంద్‌పాషాను అరెస్టు చేశారు. కాగా, వ్యభిచారుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని అక్కడి వారు వాపోతున్నారు.