హుజూరాబాద్ రూరల్ : మండలంలోని రాంపూర్ గ్రామంలో శుక్రవారం ఎనగందుల పద్మ అనే మహిళపై దొంగలు దాడి చేశారు. ఇంట్లోని కొంత నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్...
హుజూరాబాద్ రూరల్ : మండలంలోని రాంపూర్ గ్రామంలో శుక్రవారం ఎనగందుల పద్మ అనే మహిళపై దొంగలు దాడి చేశారు. ఇంట్లోని కొంత నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. ఎనగందుల పద్మ భర్త వెంకటేశ్వర్లు ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తున్నా డు. ఆమె ఇంటి వద్దనే ఉంటోంది. మిట్ట మధ్యాహ్నం ఎవరూలేని సమయంలో ముగ్గురు ముసుగు వేసుకొని వచ్చి ఇంట్లో చొరబడ్డారు. పద్మపై దాడి చేయగా స్పృహ కోల్పోయింది. దొంగలు ఇంట్లో ఉన్న ఐదు తులాల బంగారం, ఊ.1.50 లక్షలు, ఒక జత పట్టగొలుసులు, రెండు చిన్న వెండి ప్లేట్లను ఎత్తుకెళ్లారు. ఆమె ప్రస్తుతం హుజూరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విఫయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె భర్త తెలిపాడు.
ఇది రెండోసారి..
ఏడాదిక్రితం దొంగలు దాడి చేసినట్లు వెంకటేశ్వర్లు తెలిపా రు. ఆ సమయంలో రూ.40వేలు, రెండు తులాల బంగారం ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు. అప్పుడు కూడా ఇంట్లో పద్మ ఒంటరిగా ఉన్నట్లు వివరించాడు. ఈ విషయమై ఆ రోజు పోలీసుల కు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నాడు.