-ఫ్రెండ్లీ పోలీసింగ్ మొబైల్ యాప్‌కు విశేష స్పందన -5 రోజుల్లో 5 వేల డౌన్లోడ్లు -పలు సమస్యలపై సాక్ష్యాలతో ఫిర్యాదులు -చాలా బాగుందం...
-ఫ్రెండ్లీ పోలీసింగ్ మొబైల్ యాప్‌కు విశేష స్పందన
-5 రోజుల్లో 5 వేల డౌన్లోడ్లు
-పలు సమస్యలపై సాక్ష్యాలతో ఫిర్యాదులు
-చాలా బాగుందంటూ కామెంట్లు
-మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు పోలీసుల కసరత్తు
-ఐదు రోజుల్లో 5 వేల డౌన్లోడ్లు
-నగర పోలీసుల్లో ఉత్సాహం
నాంపల్లిలో ఓ ట్రాఫిక్ ఎస్సై నెంబర్ ప్లేట్ లేని వాహనాన్ని నడుపుతు న్నాడంటూ ఫొటోతో సహా ఫిర్యాదు.. మూసారాంబాగ్‌లో జనావాసాల మధ్య కిరోసిన్ ప్లాంట్ నిర్వహిస్తున్నారంటూ కంప్లయింట్...
బేగంపేట్‌లో బహిరంగ ధూమపానంతో పాటు బైక్ రేసింగ్‌లు నిర్వహిస్తున్నారంటూ ఫొటో సాక్ష్యాలతో మరో ఫిర్యాదు... రాష్ డ్రైవింగ్ చేశాడంటూ.. మెహదీపట్నం నుంచి ఇంకోటి..
ఇవన్నీ నగర ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండా చేసిన ఫిర్యాదులు.. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు నగర పోలీసులు ప్రవేశపెట్టిన హాక్-ఐ మొబైల్ అప్లికేషన్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను ఐదు రోజుల్లోనే 5 వేలమంది డౌన్లోడ్ చేసుకున్నారు. యాప్ బాగుందంటూ వందల సంఖ్యలో కామెంట్లు పంపారు. సమస్యలపై ఫిర్యాదు చేశారు.
ఈ యాప్‌ను పలు మార్పులతో మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. ఫిర్యాదుల స్వీకరణ, తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రమే వాడుతున్న ఈ యాప్‌ను త్వరలో విండోస్ వెర్షన్లోనూ అందుబాటులోకి తేనున్నారు.
హైదరాబాద్,(క్రైంబ్యూరో-టీమీడియా): పోలీసు సేవల్లో ప్రజల భాగస్వామ్యం కోసం, నేరాలను అదుపునకు నగర పోలీసులు ప్రవేశపెట్టిన హాక్-ఐ మొబైల్ అప్లికేషన్‌కు సిటిజన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను రోజుల్లోనే 5 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. సూచనలు, సలహాలు వస్తున్నాయి.
మొబైల్ యాప్ ఏవిధంగా పనిచేస్తోందో పరీక్షించేందుకు చాలామంది యూజర్లు ప్రయత్నిస్తున్నారు. ట్రాఫి క్, శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలను పోలీసులకు నేరుగా చెప్పేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ యాప్‌కు వస్తు న్న స్పందనపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాప్ నుం చి వస్తున్న ఫిర్యాదులపై ఇప్పటికే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సైబరాబాద్ నుంచి కూడా ఫిర్యాదులు అందుతుండడంతో సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు వాటిని బదిలీ చేస్తున్నారు.
ట్రాఫిక్ సమస్యలే ఎక్కువ..
యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులలో ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలే ఉంటున్నాయి. నాంపల్లిలో ఓ ట్రాఫిక్ ఎస్సై నెంబర్ ప్లేట్ లేకుండా వెళ్తున్న ఫొటోను తీసి స్థానికులు పోలీసులకు పంపించారు. మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని మూసారాంబాగ్‌లో జనవాసాల మధ్య కిరోసిన్ ప్లాంట్ నిర్వహిస్తున్నారని, ఇది ప్రమాదకరమంటూ ఫిర్యాదు అందింది. దీనిపై పోలీసులు విచారణ చేశారు. బేగంపేట్‌లో బహిరంగంగా ధూమపానం చేస్తున్నారని, బైక్ రేస్‌లతో ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయంటూ ఫొటోలతో ఫిర్యాదులు చేశారు.
విలువైనా కామెంట్లు..
పోలీసులు తయారు చేసిన మొబైల్ యాప్‌పై 200 మంది కామెంట్లు చేశారు. ఇందులో 85 శాతం మంది బాగుందంటూ కామెంట్లు పోస్టు చేశారు.
జోన్ల వారీగా శిక్షణకు సన్నాహాలు
యాప్ నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వాటిని పరిష్కరిస్తే దీన్ని ప్రజలు మరింత ఆదరిస్తారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రజలు ఈ యాప్‌ను విరివిగా ఉపయోగించుకుంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ బలోపేతమవుతుందనే ఆలోచనలో ఉన్నారు. ఈ యాప్ నుంచి వచ్చే ఫిర్యాదులు, వాటి పరిష్కారం వంటి అంశాలపై పోలీస్స్టేషన్ల సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలోని ఐదు జోన్ల పోలీసులకు ఐదు రోజులలో శిక్షణను పూర్తి చేయాలని యోచిస్తున్నారు.
శిక్షణ పూర్తయ్యే వరకు హాక్-ఐ యాప్‌కు ఏదైనా చిన్నపాటి మార్పులు ఉంటే చేస్తారు. ఇప్పటికే ప్రజల నుంచి వచ్చిన సూచనలను, సలహాలను తీసుకొని మరిన్ని మెరుగులు దిద్దడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్కే పనిచేస్తోంది, దీనిని విండోస్ సాఫ్ట్వేర్ యూజర్లు కూడా వాడుకునేలా తీర్చిదిద్దుతున్నారు.