మెదక్ : జిల్లాలోని జహీరాబాద్ మండలం చిరాగ్పల్లి వద్ద వోల్వో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇంజిన్లో నుంచి పొగలు రావ...
మెదక్ : జిల్లాలోని జహీరాబాద్ మండలం చిరాగ్పల్లి వద్ద వోల్వో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇంజిన్లో నుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులందరినీ కిందకు దించేశాడు. ఈ క్రమంలోనే బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తత కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది.