ఇసుక ఇక చౌక

మ0చిర్యాల : ఇసుకను చౌకధరకే అమ్మాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇసుక కావాలనుకునే వారు మీ సేవలో దరఖాస్తు చేసుక...


మ0చిర్యాల : ఇసుకను చౌకధరకే అమ్మాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇసుక కావాలనుకునే వారు మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే ఇంటివద్దకే పంపేందుకు ఏరాట్లు చేస్తున్నారు. గతంలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వాదాయనికి కోట్లల్లో గండి కొడుతూ ఇష్టమైన ధరలకు అమ్ముతూ ఇటు ప్రభుత్వాన్ని, వినియోగదారులను మోసం చేస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం న్యూ శాండ్ మైనింగ్ పాలసి జీవో నం 38/2014ని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, పరిశ్రమల ప్రోత్సహక శాఖ కమిషనర్ ప్రదీప్ చంద్ర జారీ చేశారు. ఇది జిల్లా జైంట్ కలెక్టర్ పర్యవేక్షణ లో ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఎమ్‌డీసీ) ద్వారా వినియోగ దారులకు ఏలాం టి ఇబ్బంది లేకుండా నాణ్యమైన ఇసుకను చౌక ధరకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఇక అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు అక్ర మ తవ్వకాలు నిర్మూలించిందేందుకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లను చేస్తోంది. 

ఇసుక డంపు యార్డుల నిర్వహణ, ఇసుక రీచుల కేటాయింపు, తనిఖీలు, తవ్వకాలు వంటి వాటిపై ఇక ఎప్పటికప్పుడు, టీఎస్‌ఎమ్‌డీసీ తనిఖీలు నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వారం క్రితమే జిల్లా మైనింగ్, రెవెన్యూ అధికారులకు అందజేశారు. స్థానిక సంస్థల అవసరాలకు, బడు గు భలహీణవర్గాల గృహనిర్మూలనకు తీసుకునే ఇసుకకు ఎలాంటి రుసుము లేదని అధికారులు స్పష్టం చేశారు. వాగులు, కాలువల్లోని ఇసకు సేకరనకు వేర్వేరు విధానాలను అనుసరిస్తూ చౌక ధరలకు నాణ్యమైన ఇసుకును ప్రజలకు అందించానే కొత్త పాలసీ రూపొందించినట్లు ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

పాలసీలోని మార్గదర్శకాలు
ఐదు కేటగిరీలుగా ఇసుకు తవ్వకాల కోసం మూ డు వణరులను గుర్తించారు. (ఏ)నదులు, కాలువలు (బీ) రిజర్వాయర్లు, పూడిక తీత (సీ) పట్టభుముల్లోని ఇసుకు తవ్వకాల ద్వారా లభ్యమయ్యేది. నదులు, కాలువలు, పరిమానం స్థాయిని అనుసరించి, ఐదు కేటగిరీలుగా విభజజించారు. చిన్న చిన్న కాలువలు కేటగిరి ఒకటిగా ఆయ స్థా యలను బట్టి ఇతరనదులను, కాలువలను 2, 3, 4లుగా విభజించారు. కృష్ణ గోదావరి నదులను కే టగిరి 5గా విభజించారు. కేటగిరి 1, 2లో లభించే ఇసుకును స్థానిక సంస్థలకు బలహీన వర్గాలవారి ప్రభుత్వ గృహనిర్మాణానికి కేటాయించారు. ఈకేటగిరిలోని ఇసుక తవ్వకాలకు ఎలాంటి రుసుము వసులు చేయరాదు. స్థానిక సంస్థల పరిధిలో ని ర్మించే పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాళ్ల విశయంలో మాత్రం భవణ నిర్మాణ ఏజెన్సీల నుంచి సీనరేజి వసుల్ చేయల్సి ఉంది ఈ పరిధిలో చేపట్టె ఇసుకు తవ్వకాలకు, రవాణాకు యంత్ర ఉపయోగాన్ని నిషేధించారు. 

చిన్నస్థాయి కాలువలు, నదుల నుంచి లభించే ఇసుకను ఖచ్చితంగ ఆయా స్థానిక ప్రాంతాల్లోనే వినియోగించాలి. ఇతర ప్రాంతాలకు తరలించరాదన్న నిబంధనలున్నా యి. ఇసుకు రీచులను గుర్తించడానికి జిల్లా స్థాయి కమిటీని ఎర్పాటు చేస్తారు. ఈ కమిటీలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఈ విధాణంలో ఇసుకును అక్రమంగ తరలంచేందుకు వీలు లేకుండా విధి విధానలను రూపొందించారు. జిల్లాలోని 52 మండలలో 24 ఇసుక రీచు లున్నాయి. వీటిని (టీఎస్‌ఎమ్‌డీసీ) ఆధ్వర్యంలో గుర్తించి రీచ్‌లకు వేలం నిర్వహిస్తారు. అధిక మొ త్తంలో బిడ్ వేసిన కాంట్రాక్టర్లకు ఇసుకను తవ్వేందుకు అనుమతిని ఇస్తారు.

స్టాక్ యార్డుల ద్వారా అమ్మకాలు
జిల్లాలో ఎక్కడైనా స్టాక్ యార్డుల ద్వారా అమ్మకాలు నిర్వహిస్తారు వేలంలో దక్కించుకున్న కాం ట్రాక్టర్ల ద్వార ఇసును టీఎస్‌ఎమ్‌డీసీ ఆధ్వర్యలో స్టాక్ యార్డులోకి తరలిస్తారు. యార్డులోని ఇసుక అమ్మకాలను సీసీటీవీల ద్వారా పర్యవేక్షణ జరుగుతుంది. రవాణా చేసేందుకు సెక్యూరిటీ శీల్‌తోవున్న బిల్లులను స్టాంపులతో వున్న వేబిల్లులను టీఎస్‌ఎమ్‌డీసీ జారి చేస్తుంది. ఇసుకను రవాణా చేసే వాహనాలు జీపీఎస్ విధానంతో పర్యవేక్షణ జరుగుతుంది. అక్రమంగా వేబిళ్లులు లేకుండా తరలించే వాహనాలను స్వాధీనం చేసుకొని. జరిమాన విధిస్తారు. గతంలో జిల్లాలో విచ్చలవిడిగ అక్రమంగ ఇసుక తవ్వకాలు నిర్వహంచి రవాణా చేసేది. ఆక్రమ రావాణాకు అరికట్టేందుకు ప్రభు త్వం నూతన విధానాన్ని అమల్లోకి తేనుంది. 

ప్రభుత్వాదయం పక్కదారి
గతంలోఇసుకు విచ్చలవిడిగా అక్రమంగ తూర్పుజిల్లా మంచిర్యాల, చెన్నూరు ప్రాంతాలలోని గోదవరి ఇసుకను అక్రమంగ హైదరాబాద్, మహారాష్ట్ర, విజయవాడ ప్రాంతాలకు తరలించేవారు. ఇక్కడ ఒక ట్రాక్టర్ ధర రూ. 1500 నుంచి రూ. 2000 వరకు అమ్ముతున్నారు. అదే హైదరబాద్, మహారాష్ట్ర ప్రాంతాలకైతే రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు విక్రయిస్తున్నారు. అధికారు ల పర్యవేక్షణ లోపంతో ఇసుక అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తునారు. దీంతో ప్రభుత్వాదాయనికి కోట్లరూపాయల్లో గండిపడింది. భూగర్భఘనుల శాఖ అధికారులు రేవేన్యూశాఖ అధికారులు బారిగ మాముల్లు తీసకొని చూసీ చూడనట్లు వ్యవహరించడంతో ఇసుక వ్యాపారులు విచ్చలవిడిగ రెచ్చిపోతున్నారు. 

ర్యాక్ శాండ్‌కు పరిశ్రమ హోదా
తెలంగాణ ప్రాంతంలో సహజమైన ఇసుక లభించకపోవడంతో ర్యాక్ శాండ్‌ను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం శాండ్‌ను ఉత్పత్తి చేసే క్రషర్లకు పరిశ్రమ హోదా కల్పించలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమ హోదా క ల్పించడంతో వ్యాట్, విద్యుత్ రుసుముల్లో రాయి తీ లభిస్తుంది. కొత్తగా పరిశ్రమలు పెట్టుకునేవారికి ప్రోత్సాహాకాం ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వ శాఖలు చేపట్టే నిర్మాణాల్లో సగం ర్యాక్ శాండ్ ఉపయోగించాలని నిర్ణయించారు.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: ఇసుక ఇక చౌక
ఇసుక ఇక చౌక
http://banzaisurfschool.com/wp-content/uploads/2013/07/TheSand.jpg
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/01/blog-post_86.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/01/blog-post_86.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy