మెదక్ : జిల్లాలోని ఝరాసంగం కేతకి సంగమేశ్వరస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. 10 తులాల బంగారం, అర కిలో వెండిని గుర్తు తెలియని వ్యక్తులు అప...
మెదక్ : జిల్లాలోని ఝరాసంగం కేతకి సంగమేశ్వరస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. 10 తులాల బంగారం, అర కిలో వెండిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఆలయ పూజారి దేవాలయం వద్దకు వచ్చి చూడగా ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.