హైదరాబాద్: స్వైన్ఫ్లూ నివారణకు సాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నమోదవుతున్న స్వైన్ఫ్లూ ...
హైదరాబాద్: స్వైన్ఫ్లూ నివారణకు సాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నమోదవుతున్న స్వైన్ఫ్లూ కేసుల నేపథ్యంలో సీఎం ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేసీ నడ్డాతో ఫోన్లో మాట్లాడారు. స్వైన్ఫ్లూ నివారణకోసం 50 వేలకిట్లు , 10 వేల సిరప్లతోపాటు రోగ నిర్ధారణ చేసే యంత్రాలను వెంటనే అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. స్వైన్ఫ్లూ నివారించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.