వాటర్‌షెడ్‌లో అడ్డగోలు అక్రమాలు -ప్రజల భాగస్వామ్యం లేకుండానే ప్రణాళికలు ఇష్టారాజ్యంగా పనులు -అంతటా అవినీతి ఊటలు ఒక్క దనోరాలోనే లక్షలాది...
-ప్రజల భాగస్వామ్యం లేకుండానే ప్రణాళికలు ఇష్టారాజ్యంగా పనులు
-అంతటా అవినీతి ఊటలు ఒక్క దనోరాలోనే లక్షలాది రూపాయలకు రెక్కలు మామూలుగా తీసుకున్న డ్వామా అధికారులు
-సర్వత్రా విమర్శలు
భూగర్భ జలాలను వృద్ధి చేయాలనే లక్ష్యంతో డ్వామా ఆధ్యర్యంలో చేపట్టిన వాటర్‌షెడ్‌లో అక్రమాలకు అంతులేకుండా పోయింది. చాలాచోట్ల స్థానిక ప్రజలకు భాగస్వామం కల్పించకుండా, అడ్డదిడ్డంగా పనులు చేసి అందినకాడికి దండుకున్నట్లు స్పష్టమవుతున్నది. గుంజాలలో అడుగడుగునా నాణ్యతాలోపం బయటపడగా, లక్షలాది రూపాయలు పక్కదారి పట్టినట్లు తెలుస్తున్నది. కళ్ల ముందే జరుగుతున్నా డ్వామా అధికారులు మామూలుగా తీసుకుంటున్న తీరు, విమర్శలకు తావిస్తున్నది.
(టీ మీడియా, ఆదిలాబాద్ ప్రతినిధి);స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని మెరుగుపర్చి, సరళమైన సాంకేతిక పరిజ్ఞానం, సంస్థాగత ఏర్పాట్ల తో వారికి (ప్రజలకు) సహకరించి, వారి అనుభవాలను, ఆలోచనలను ప్రోత్సహించి కట్టడాల ని ర్మాణం, నిర్వహణ వారికి వారే చేసుకునే విధంగా అవకాశం కల్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న వాటర్‌షెడ్ కార్యక్రమాల్లో ఇది ప్రధానమైన మార్గదర్శక సూత్రం. బంజరు, క్షీణించిన భూముల అభివృద్ధిలో స్థాని క అవసరాలకు అనుగుణంగా, ప్రాంత పరిస్థితులకు తగినట్లుగా వనరుల కల్పనకు ప్రణాళికలు రచించుకోవడం, మహిళలు, వ్యవసాయ కూలీ లు, చిన్నా, సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీలకు భా గస్వామ్యం కల్పించి వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చాలనేది వాటర్‌షెడ్ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం.
జిల్లాలోనూ ఇదే లక్ష్యంతో ప్రారంభించిన వాటర్‌షెడ్ కార్యక్రమాలు చాలాగ్రామాల్లో ప్రజలతో సంబంధాలు లేకుండా జరిగాయి. ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా అధికారుల పెత్తనం కొనసాగింది. ఫలితంగా కోట్లు ఖ ర్చు చేసి అమలు చేస్తున్న వాటర్‌షెడ్ కార్యక్రమాలపై ప్రజలకు విశ్వాసం పెరగలేదు. అవి మావీ అ నే భావన కలగలేదు. వాటర్‌షెడ్ కార్యక్రమాలతో కలిగే ప్రయోజనాలపై గ్రామాల్లో చాలా మందికి నేటికీ అవగాహన లేదు. తాంసి మండలం గుం జాల జరిగిన వాటర్‌షెడ్ కార్యక్రమాల అమలు తీరు లోపాలను బయటపెడుతోంది.
-ఒక్క ధనోరకే 85 లక్షలు
2009-10 బ్యాచ్‌లో జిల్లాకు వచ్చిన 9 మైక్రో వాటర్‌షెడ్ కార్యక్రమాల అమలుకు ఎంపికైన గ్రా మాల్లో తాంసి మండలం ధనోర ఒకటి. ఈ గ్రా మం శివారులోనిదే గుంజాల. 90 శాతం గిరిజనులే ఉన్న ఈ గ్రామంలో సుమారు 500 మంది జనాభా ఉంది. ఇక్కడంతా బంజరు భూమే విస్తరించి ఉంది. భూగర్భజల వృద్ధి, భూసారం, ప్రజ ల జీవనోపాధుల పెంపుదల, పర్యావరణ సమతుల్యతను పెంచేందుకు గ్రామంలోని 710 హెక్టార్ల భూమిని ఎంపిక చేశారు. ఇందుకోసం 85.20 లక్షలతో ప్రణాళికలు వేశారు. పశువుల తాగునీటి తొట్టె, నీటిశుద్ధి సరఫరా షెడ్డు, టెంట్, ఖండిత కం దకాలు, నీటి నిలువ కందకాలు, విడిరాళ్ల కట్టలు, రాతి డ్యాంలు, ఊటకుంట, చెక్‌డ్యాంలు, రోడ్లకిరువైపులా చెట్ల పెంపకం, పండ్లతోటల పెంపకం, గ్రామైక్య సంఘాలకు రివాల్మింగ్ ఫండ్ కింద వ చ్చిన నిధులన్నీ ఖర్చు చేశారు.
2009-10 బ్యాచ్ పనులు వచ్చే ఏడాది (2015) మార్చి వరకు జరగాల్సి ఉండగా, మూడు నెలల క్రితమే పూర్తి స్థా యిలో ఖర్చు చేశారు. ఇప్పుడు ఈ వాటర్‌షెడ్ క మిటీ ఖాతాలో 2 వేలు మాత్రమే మిగిలాయి. అయితే ఇన్ని లక్షల నిధులు ఒక్క గ్రామానికి కేటాయించినపుడు వాటిని సక్రమంగా వినియోగించుకోలేదనే ఆరోపణలున్నాయి. పనులు చేపట్టడం లో నిర్లక్ష్యం, ప్రజలతో సంబంధాలు లేకుండా అధికారులే నిర్ణయాలు తీసుకుని పనులు చేపట్ట డం వంటి చర్యల కారణంగా ఈ వ్యవస్థపై స్థానికులకు నమ్మకం ఏర్పడకుండా పోయింది. కొన్ని నిధులతో చేపట్టిన పనులు ప్రాజెక్టు పూర్తికాక ముందే కనుమరుగైపోయాయి.
-అమలు జరిగిన తీరు
గ్రామంలో 85.20 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. అయితే చేపట్టి న పనుల్లో అనేకం అస్తవ్యస్తంగా తయారయ్యా యి. గ్రామంలో 9.08 లక్షలు ఖర్చు చేసి 61 విడిరాళ్ల కట్టలు నిర్మించారు. రైతుల చేలల్లో ఉన్న వి కొన్ని తప్పా, మిగతావి అక్కరకు రాకుండా పోయాయి. ఎర్రగుట్ట ప్రాంతంలో రాళ్ల కట్టలు, కొన్ని కొట్టుకుపోయాయి. ఉన్నవి వరద నీటిని ఆ పలేకపోతున్నాయి. గ్రామంలో మూడు చెక్‌డ్యాం లు నిర్మించారు. ఇందులో పాత హన్మాన్ గుడి వద్ద పూర్తిగా బండపై నిర్మించిన చెక్‌డ్యాంకు కింది నుంచి బుంగ పడింది. అడుగు భాగంలో రాయి ని తొలిచి నిర్మించాలని స్థానికులు చెప్పినా అధికారులు వినిపించుకోలేదు. ఎర్రగుట్ట సమీపంలోని మరో చెక్‌డ్యాంను కూడా పూర్తిగా బండ మీదనే నిర్మించారు. ఇది కూడా ఇప్పుడు లీకవుతోంది. ఏదో ఒక రోజు తెగిపోవచ్చని స్థానికులు చెబుతున్నారు.
రోడ్లకు ఇరువైపులా చెట్లు పెంచినట్లు రికార్డులు రాశారు. కానీ ఎక్కడా ఒక్క చెట్టు కనిపించింది లేదు. చెట్ట పెంపకానికి జిల్లాలో 17 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి రూ. 1.70 లక్షల విలువైన చెట్లు పంపిణీ చేసినట్లు రికార్డులు ఉన్నాయి. కానీ ఎవరి చేనులో చూసినా ఒక్క మొక్కా బతికింది లేదు. ఈ విషయమై స్థానిక వాటర్‌షెడ్ కమిటీ చైర్మన్ యర్మా శంకర్ మాట్లాడుతూ జూన్, జూలైలో ఇవ్వాల్సిన చెట్లను సెప్టెంబర్ నెలలో ఇచ్చారని, అప్పటికే అవి ఎండిపోయాయని అ న్నారు. మరో విచిత్రం ఏమిటంటే రూ. 1.63 లక్షలతో నీటి శుద్ది సరఫరా షెడ్డు నిర్మించినట్లు లెక్క లు రాశారు. ఈ గ్రామంలో అలాంటిదేమీ నిర్మిం చలేదని స్థానికుడైన ఆత్రం రామేశ్వర్ స్పష్టం చేశారు. నిజానికి ఈ గ్రామంలోని పాఠశాల వద్ద ఈ నిధులతో ఒక రేకుల షెడ్డు నిర్మించారు. వర్మీ కంపోస్టు ఎరువులను సహజంగా వృద్ధి చేసే లక్ష్యంతో గ్రామంలో ఇంటింటికి నాడేప్ కంపోస్టు ఎరువుల గుంతలు కట్టించారు. ఇందులో ఒకట్రెం డు అవి కూడా శిథిలావస్థలో మిగిలాయి. ఆదాయాభివృద్ధి కార్యక్రమాల కింద అమలు చేసిన వివిధ పనులు కూడా స్థానికులకు అంతగా ఉపయోగంలోకి రాలేదు.
-అడుగడునా నిర్లక్ష్యం
జిల్లాలో అమలవుతున్న వాటర్‌షెడ్ కార్యక్రమా ల్లో అధిక సంఖ్యలో ప్రజల భాగస్వామ్యం ఉం డాలి. ప్రజా అభిప్రాయం మేరకే స్థానికంగా ఉన్న వనరులను గుర్తించి వాటిని ఉపయోగంలోకి తేవాల్సిన బాధ్యత జిల్లా నీటి యాజమాన్య సం స్థపై ఉంది. వాటర్‌షెడ్ కార్యక్రమాల్లో 38 రకాల పనులు నిర్వహించాల్సి ఉండగా చాలా గ్రామాల్లో ముఖ్యమైన అంశాలను పక్కన పెడుతున్నారు. నిజానికి ప్రజలను భాగస్వామ్యులను చేయడం, వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వంటి పనులకు వాటర్‌షెడ్ నిధుల్లో వెసులుబాటు ఉం ది. వాటర్‌షెడ్‌లో మంజూరవుతున్న నిధుల్లో 44 శాతం ప్రజలకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు, వారి ఆదాయాభివృద్ధిని పెం పొందించేందు, పరిపాలన కొరకే వెచ్చిస్తున్నారు. మిగిలిన 56 శాతం నిధులతోనే సహజ వనరుల నిర్వహణ పనులు చేపడుతున్నారు.
గుంజాల గ్రా మాన్నే తీసుకుంటే ఇక్కడ ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కేవలం 500 మంది జనాభానే ఉంది. ఈ గ్రామానికి కేటాయించిన రూ. 85.20 లక్షల్లో 44 శాతం నిధులు ఎవరెవరికి ఏమేమి ఇచ్చారనేది అధికారుల వద్ద లెక్కలు తప్ప భౌతికంగా ప్రజల వద్ద ఆస్తులు కనిపించడం లేదు. ఈ ప్రాజెక్టు ఇంకా పూర్తికాక ముందే ఇలాం టి పరిస్థితి నెలకొనడం శోచనీయం. నిధులు వృథా చేయడంలో కూడా డ్వామా అధికారులు ముందు వరసలో నిలిచారు. గుంజాలలో బండ మీద చెక్‌డ్యాంలు నిర్మించాల్సి వచ్చినపుడు అడు గు భాగం తొలచకుండా ఎందుకు నిర్మించారో డ్వామా అధికారులకే అర్ధం కావాలి. ఈ కారణం గా ఇప్పటికే ఒక చెక్‌డ్యాంకు బుంగపడగా మరొకటి పడేందుకు సిద్దంగా కనిపిస్తోంది.
-లోపాలు గుర్తించరా?
మొదటి బ్యాచ్‌లో చేపట్టిన ఈ పనులపై గత నెల 31న ఆడిట్ పూర్తి చేశారు. కానీ ఇలాంటి లోపా లు అధికారుల దృష్టికి ఎందుకు రావడం లేదనే అనుమానాఉన్నాయి. ధనోర గ్రామ పంచాయతీ పరిధిలోని గుంజాల, భీంపూర్‌లో వాటర్‌షెడ్ కా ర్యక్రమాల్లో అనేక లోపాలున్నాయి. కానీ అధికారులు పట్టించుకున్నపాపాణ పోవడం లేదు. ధనో రా గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఉష్కెఒర్రెపై నిర్మించిన చెక్‌డ్యాం పూర్తిగా ధ్వంసమైంది. వరదలు రావడం వలన ఇది దెబ్బతిన్నదని అధికారులు నమ్మబలుకుతున్నారు. కా నీ నాణ్యత లోపంపై మాత్రం పెదవి విప్పరు.
తప్పులు చేసిన కొన్ని ఎన్జీఓలను కూడా అధికారులు వెనకేసుకొస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. చర్యలు తీసుకున్నట్లు కాగితాల్లో తప్పా ఆచరణలో చూపడం లేదనే ఆరోపణలున్నాయి. వాటర్‌షెడ్ కార్యక్రమాల కింద కోట్లాదిగా వస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకోవాలంటే ప్రజ ల భాగస్వామ్యం అవశ్యం. కానీ అధికారులే అన్నీతామే అయి పనులు నడిపించినచోట ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఈ విషయమై దృష్టి సారించి వాటర్షెడ్స్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. లేదంటే ఎన్ని కోట్లు ఖర్చు చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.