హైదరాబాద్ : లౌడ్‌స్పీకర్ విషయమై తలెత్తిన వివాదం చిలికి, చిలికి గాలివానగా మారి ఓ వృద్ధుడి హత్యకు దారితీసింది. చాదర్‌ఘాట్ ఠాణా పరిధిలో జర...
హైదరాబాద్ : లౌడ్‌స్పీకర్ విషయమై తలెత్తిన వివాదం చిలికి, చిలికి గాలివానగా మారి ఓ వృద్ధుడి హత్యకు దారితీసింది. చాదర్‌ఘాట్ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...చాదర్‌ఘాట్ ఆజంపురా డివిజన్లో లౌడ్‌స్పీకర్ సౌండ్ తగ్గించాలని స్థానికంగా నివాసముండే ఓ వ్యక్తి (68) అతడి పక్కింటి యువకుడిని మందలించాడు.
ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదానికి దారితీసింది. ఆగ్రహానికి గురైన యువకుడు వృద్ధుడిపై తల్వార్‌తో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో స్థానికంగా స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ముందుజాగ్రత్త చర్యగా అదనపు బలగాలను రంగంలోకి దింపారు. సమాచారం అందుకున్న తూర్పుమండలం డీసీపీ రవీందర్, సుల్తాన్‌బజార్ ఏసీపీ గిరిధర్ పరిస్థితిని సమీక్షించారు. మలక్‌పేట ఎమ్యెల్యే బలాల చేరుకుని ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.