-మంత్రి జోగు రామన్న -వివేకానందుడి మార్గంలో పయనించాలని సూచన -ఘనంగా జయంతి వేడుకలు ఆదిలాబాద్ రూరల్ : దేశం అభివృద్ధి చెందాలంటే యువతీయువక...
-మంత్రి జోగు రామన్న
-వివేకానందుడి మార్గంలో పయనించాలని సూచన
-ఘనంగా జయంతి వేడుకలు
ఆదిలాబాద్ రూరల్ : దేశం అభివృద్ధి చెందాలంటే యువతీయువకులు కలిసి కట్టుగా ఉండాలని, స్వామి వివేకానం ద చూపిన మార్గం, యావత్ ప్రపంచానికి అనుసరనీయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షే మ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ము ఖ్యంగా జిల్లాలోని యువతీయువకులు వివేకానం ద చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. సోమవారం జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనం గా నిర్వహించారు. న్యూ హౌజింగ్ బోర్డులోని వివేకానంద విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ చికాగోలో జరిగిన సమావేశాల్లో తనకు ఇచ్చిన ఐదు నిమిషాల కాలవ్యవధిలో భారతదేశం గొప్పతనం, విశిష్టతలను వివేకాందుడు ప్రపంచానికి వివరించగలిగాడని గుర్తు చేశారు. సమాజానికి అవసరమైన కార్యక్రమాలు చేయడానికి యువత ముందుకు రావాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, జడ్పీటీసీ ఇజ్జగిరి అశోక్, ఎంపీపీ నైతం లక్ష్మీశుక్లాల్, బట్టి సావర్గాం సర్పంచ్ రాథోడ్ రామారావ్, ఉపసర్పంచ్ స్వామి, ఎంపీటీసీ జాదవ్ పవన్‌నాయక్, టీఆర్ఎస్ నాయకులు అడ్డి భోజారెడ్డి, షాదిజోద్దిన్, జోగు ప్రేమేందర్, కాలనీవాసులు తిరుమల్, విజయ్రావ్, వెంకట్, సత్యనారాయణగౌడ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
శాంతినగర్ : జిల్లా యువతకు అన్ని విధాలా సహకరిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే లా కృషి చేస్తున్నామని యువజన సర్వీసుల శాఖ, స్టెప్ సీఈఓ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశమందిరంలో జిల్లా యువజన సర్వీసులశాఖ, స్టెప్ ఆధ్వర్యంలో స్వా మి వివేకానంద 151వ జయంతిని నిర్వహించా రు. ఏజేసీ ఎస్ఎస్ రాజు, పవన్‌కుమార్, ఎస్బీహెచ్ లీడ్ బ్యాంకు మేనేజర్ ఉదయ్రంజన్ శర్మ జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా స్టెప్ సీ ఈఓ మాట్లాడుతూ జిల్లాలోనికళాకారుల ప్రతిభ ను వెలికితీసేందుకు జోనల్‌స్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీలు ని ర్వహిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు రుణాలు కల్పిస్తూ, ఆర్థికంగా చేయూతనందిస్తున్నామన్నారు. లక్ష్యంతోపాటు ప్రణాళికలతో చదువుకుంటే యువత బాగు పడుతుందని టీఆర్ఎస్ నాయకుడు పవన్‌రావు పేర్కొన్నారు. యువత సన్మార్గంలో నడిచినపుడే దేశం సన్మార్గంలో నడుస్తుందని రామకృష్ణ సేవాసమితి అధ్యక్షుడు ఆరె భూమన్న చెప్పారు. ఎస్బీహెచ్ లీడ్‌బ్యాంకు మేనేజర్ ఉదయ్ రంజన్శర్మ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి చదువుకోవాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందినవారికి, పాల్గొన్నవారికి ప్రశంసపత్రాలు, మె మోంటోలను అందించారు.
-అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సంప్రదాయం ఉట్టిపడేలా కళాకారులు నృత్యాలు చేశారు. ఉట్నూర్ డివిజన్ ఎస్బీహెచ్ డైరెక్టర్ రాజు, డీసీపీఓ రాజేంద్రప్రసాద్, నాగేశ్వర్రావు, రాజశేఖర్, రమేశ్, కృష్ణ, కృష్ణమోహన్, మధుకర్, రాజన్న, బాలశంకర్ కృష్ణ, గణేశ్, సుదర్శన్, సంతోష్ పాల్గొన్నారు.