హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 5 రోజుల పాటు తలపెట్టిన సమ్మెను బొగ్గు గని కార్మికులు విరమించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు సఫలమైన నేపథ్యంలో సమ...
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 5 రోజుల పాటు తలపెట్టిన సమ్మెను బొగ్గు గని కార్మికులు విరమించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు సఫలమైన నేపథ్యంలో సమ్మెను విరమిస్తున్నట్లు కార్మికులు ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి కేంద్రం కమిటీని ఏర్పాటు చేయనుంది. బొగ్గు గనులను ప్రైవేటీకరించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ స్పష్టం చేశారు. బొగ్గు గని కార్మికుల ప్రయోజనాలు పరిరక్షిస్తామని పేర్కొన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం విదితమే.
