వాషింగ్టన్ : బీర్ కేన్లపై మహాత్మాగాంధీ బొమ్మను ముద్రించి తీవ్ర వివాదాన్ని సృష్టించిన అమెరికాకు చెందిన మద్యం సంస్థ న్యూఇంగ్లండ్ బ్రివింగ్...
వాషింగ్టన్ : బీర్ కేన్లపై మహాత్మాగాంధీ బొమ్మను ముద్రించి తీవ్ర వివాదాన్ని సృష్టించిన అమెరికాకు చెందిన మద్యం సంస్థ న్యూఇంగ్లండ్ బ్రివింగ్ కంపెనీ దిగొచ్చింది. ఈ వివాదాన్ని ముగించేందుకు సాధ్యమైనంతమేరకు ప్రయత్నిస్తామని, గాంధీ బొమ్మను తొలగిస్తామని పేర్కొంది. గాంధీ బొమ్మను ముద్రించి భారతీయుల మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్తున్నట్టు ఫేస్బుక్లో ఆ సంస్థ పోస్టు పెట్టింది. ఈ విషయంలో తమకు బెదిరింపులు రావడంతోపాటు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నట్టు సమాచారం అందిందని, అందుకే ఈ వివాదాన్ని ముగించాలని తాము భావిస్తున్నామని తెలిపారు.