హైదరాబాద్, జనవరి 7 (టీ మీడియా): గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా రామ్‌శరణ్ నియమితులయ్యారు. ఇప్పటివరకు బోర్డు చైర్మన్‌గా పనిచేసిన ఎమ్...
హైదరాబాద్, జనవరి 7 (టీ మీడియా): గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా రామ్‌శరణ్ నియమితులయ్యారు. ఇప్పటివరకు బోర్డు చైర్మన్‌గా పనిచేసిన ఎమ్మెస్ అగర్వాల్ గతనెల 31న పదవీవిరమణ చేశారు. దీంతో కేంద్ర జల వనరుల ఇంజినీరింగ్ సేవల విభాగం (సీడబ్ల్యూఈ)లో సీనియర్ కార్యనిర్వహణ అధికారిగా పనిచేస్తున్న రామ్శరణ్కు హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీచేసింది. అదేసమయంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ బాధ్యతలను కూడా అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసినట్లు హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయానికి సమాచారం అందింది. కొత్తగా చైర్మన్‌గా నియమితులైన రామ్‌శరణ్ త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం.