-20 అడుగుల పైలాన్‌కు ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ -వరంగల్‌లో కేంద్ర మంత్రితో ఆవిష్కరణ! హైదరాబాద్: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు త...
-20 అడుగుల పైలాన్‌కు ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్
-వరంగల్‌లో కేంద్ర మంత్రితో ఆవిష్కరణ!
హైదరాబాద్: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు తలపెట్టిన ప్రతిష్ఠాత్మక మిషన్ కాకతీయ ప్రాజెక్టు పైలాన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ఖరారుచేశారు. 20 అడుగుల ఎత్తుతో నిర్మించనున్న ఈ పైలాన్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేయనున్నారు. నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పర్యవేక్షణలో ఇంజినీరింగ్ అధికారులు పైలాన్‌కు రూపకల్పన చేశారు. సీఎం కేసీఆర్ పైలాన్ నమూనాకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలోని దాదాపు 46,000 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులోభాగంగా మొదటి ఏడాది 9,000 చెరువులను అభివృద్ధి చేయనుంది. ఈ నెల మూడోవారంలో మిషన్ కాకతీయను ప్రారంభించే అవకాశముంది. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతితో ఈ పైలాన్‌ను ఆవిష్కరింపజేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్రంలో వేలసంఖ్యలో చెరువులు తవ్వించి ఆదర్శంగా నిలిచిన కాకతీయులను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం మిషన్ కాకతీయ చేపట్టింది. వరంగల్ రాజధానిగా సుస్థిరమైన సుపరిపాలన అందించిన కాకతీయ రాజులు లక్నవరం, పాకాల, రామప్ప, ఘనపురం, ధర్మసాగరం లాంటి పెద్ద చెరువులు జిల్లాలో తవ్వించారు. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా కేంద్రం లో పైలాన్ ఏర్పాటుచేయడం సముచితం గా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు.