భువనేశ్వర్: ఇకనుంచి ఐదు కిలోల చిన్న గ్యాస్ సిలిండర్లు కూడా సబ్సిడీ కింద దేశంలోని అన్ని వంటగ్యాస్ పంపిణీ కేంద్రాల్లోనూ లభించనున్నాయి. ...
భువనేశ్వర్: ఇకనుంచి ఐదు కిలోల చిన్న గ్యాస్ సిలిండర్లు కూడా సబ్సిడీ కింద దేశంలోని అన్ని వంటగ్యాస్ పంపిణీ కేంద్రాల్లోనూ లభించనున్నాయి. ఈ మేరకు నూతన పథకాన్ని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భువన్వేర్లోని అతిపెద్ద మురికివాడ అయిన సలియా సాహిలో సోమవారం ప్రారంభించారు. ఇప్పటివరకు 14.2 కిలోలున్న వంటగ్యాస్ సిలిండర్లపైనే కేంద్రం సబ్సిడీ అందజేస్తున్నది.
ఈ నేపథ్యంలో మరింతమందికి వంటగ్యాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, వంటగ్యాస్ సరఫరాలో చిక్కులు తొలగించేందుకు కేంద్రం చిన్న సిలిండర్లపైనా సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మురికివాడ ప్రజలను ఆకట్టుకునేందుకు, వారికి వంటగ్యాస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. అందులో భాగంగానే భువనేశ్వర్‌లో 215 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద మురికివాడలో ఈ పథకాన్ని ప్రారంభించినట్టు తెలుస్తున్నది.