న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజ్‌పథ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘన...
న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజ్‌పథ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా రాష్ర్టాలు శకటాలను ప్రదర్శించాయి. తెలంగాణ శకటం అందరినీ ఆకర్షించింది. బోనాల ఇతివృత్తంతో తెలంగాణ శకటం ముందుకు సాగింది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా శకటాన్ని ప్రదర్శించారు. పోతు రాజుల విన్యాసాలు, బోనాలు ఆకట్టుకున్నాయి. శకటంపై జమ్మి చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ శకటాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. ఢిల్లీలోని తెలంగాణవాసులు తెలంగాణ శకటాన్ని చూసి చప్పట్లతో స్వాగతం పలికారు.