మంచిర్యాల: డిప్యుటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్య రేపు మంచిర్యాల వెళ్లనున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చే...
మంచిర్యాల: డిప్యుటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్య రేపు మంచిర్యాల వెళ్లనున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేస్తారు. వైద్య సదుపాయలు, ఇతర వివరాలు అక్కడి రోగులను అడిగి తెలుసుకుంటారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రి ఆయన అక్కడే బస చేస్తారు. అన్ని సమస్యలపై దృష్టి సారించనున్నారు.
ఆస్పత్రి పనితీరుపై ఫిర్యాదు చేసేందుకు అటు ప్రజా సంఘాల నేతలు కూడా సిద్ధమయ్యారు. వైద్యుల పనితీరు ప్రజలు అవ స్థలు రాజయ్య దృష్టికి తీసుకళ్లేందుకు సిద్ధమయ్యారు. తాము జిల్లా అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆయనకు చెప్పనున్నారు.