హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో రాత పరీక్షల ప్రణాళిక, సిలబస్ రూపకల్పన కోసం ఏర్పాటైన 25 మంది సభ్యుల ...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో రాత పరీక్షల ప్రణాళిక, సిలబస్ రూపకల్పన కోసం ఏర్పాటైన 25 మంది సభ్యుల కమిటీ నేడు ఉదయం 11 గంటలకు కమిషన్ కార్యాలయంలో తొలిసారి సమావేశం కానున్నది. ఈ సమావేశానికి ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వం వహించనున్నారు. తెలంగాణ చరిత్రకు సంబంధించిన అంశాలతో సిలబస్లో మార్పులు చేపట్టడానికి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ అంశాలపై చర్చించడానికి కమిటీ మూడుసార్లు భేటీ అవుతుంది. ఫిబ్రవరి మొదటివారంలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.
విభజనపై ఏపీ కమిటీ:
రెండు రాష్ర్టాలకు సంబంధించి కొనసాగుతున్న ఉమ్మడి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిబ్బంది విభజనపై ఏపీ సర్కారు అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం ఏపీ సర్కారు సాధారణ పరిపాలన శాఖ జీవో విడుదల చేసింది. రెండు రాష్ట్రాలకు చెందిన స్పెషల్ సెక్రటరీలు (జీఏడీ సర్వీసెస్) కమిటీ సభ్యులుగా ఉంటారు. ఈ అధికారుల కమిటీ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ మధ్య ఉన్న ఉద్యోగులు, ఆస్తులు, ఇతర విభజనల అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటుందని ఏపీ సర్కారు జీవోలో పేర్కొన్నది.
