నిజామాబాద్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇద్దరు మహిళలు సజీవంగా దహనమైన సంఘటన జిల్లా కేంద్రంలోని బ్రహ్మపురిలో చోటుచేసుకుంది. విద్యుత్ ష...
నిజామాబాద్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇద్దరు మహిళలు సజీవంగా దహనమైన సంఘటన జిల్లా కేంద్రంలోని బ్రహ్మపురిలో చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ఇంట్లో ఉన్న గంగామణి(71) ఆమె కూతురు భూలక్ష్మి(35) ఇద్దరు సజీవ దహనమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించిందని నిర్ధారించారు.