• ప్రజలకు మరిత మెరుగైన సేవలందించాలి • పెలైట్స్, ఈఎంటీలకు ఫ్లీట్ మేనేజర్ ఆదేశాలు కోల్‌సిటీ : 2005, 2008లో కేటాయించిన 108 అంబులెన్స్‌ల క...

•ప్రజలకు మరిత మెరుగైన సేవలందించాలి
•పెలైట్స్, ఈఎంటీలకు ఫ్లీట్ మేనేజర్ ఆదేశాలు
కోల్‌సిటీ : 2005, 2008లో కేటాయించిన 108 అంబులెన్స్‌ల కండీషన్‌పై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపామని, త్వరలో గోదావరిఖనికి అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ (ఏఎల్ఎస్) అనే అత్యాధునిక సౌకర్యాలు కలిగిన వాహనాలను కేటాయించనుందని ఈఎంఆర్ఐ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఫ్లీట్ మేనేజర్ ప్రభాకర్‌శర్మ తెలిపారు. గురువారం సాయంత్రం గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో 108 సిబ్బందితో క్లస్టర్ సమావేశాన్ని నిర్వహించారు. వాహనాలలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, సిబ్బంది ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 108 సేవలను మరింత మెరుగుపర్చడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
ఇంధనం, సిబ్బంది కొరత, వేతనాలు విషయంలో సమస్యలుంటే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సిబ్బంది సైతం ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ సామాజిక దృక్పథంతో వ్యవహరిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు. సమావేశంలో ఫ్లీట్ కో-ఆర్డినేటర్ అబ్దుల్ రహీం, జిల్లా ఫ్లీట్ కో-ఆర్డినేటర్ రవికుమార్, పెద్దపల్లి డివిజన్ ఇన్చార్జి జితేందర్, చంద్రమౌళి, గోదావరిఖని, మహదేవపూర్, కాటారం, మంథని, కమాన్‌పూర్, బసంత్‌నగర్ ప్రాంతాలకు చెందిన 108 సిబ్బంది పాల్గొన్నారు.