రామకృష్ణాపూర్ : సింగరేణి సంస్థ తాజాగా విడుదల చేసిన ఉద్యోగాల భర్తీ ప్రకటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఎగ్జి క్యూటివ్, నాన్ - ఎగ్జ...
రామకృష్ణాపూర్ : సింగరేణి సంస్థ తాజాగా విడుదల చేసిన ఉద్యోగాల భర్తీ ప్రకటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఎగ్జి క్యూటివ్, నాన్ - ఎగ్జి క్యూటివ్ విభాగాల్లో 1178 పోస్టులను ఎక్స్టర్నల్ అభ్యర్తులచే భారతి చేసేందుకు సింగరేణి సంస్థ ఈ నెల 10 న ప్రకటన విడుదల చేసింది. దీంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత వేల సంఖ్యలో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు పోటి పడుతున్నారు. అయితే ఏదైనా పోస్టుకు అధికంగా అప్లికేషను లు వస్తే 1:10 నిష్పత్తి లో పరీక్ష కు అభ్యర్ధులను ఎంపిక చేసి కాల్ లెటర్ లు పంపిస్తామని సింగరేణి ప్రకటించింది. ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అభ్యర్ధుల్లో ఈ ప్రకటన తో ఆందోళన వ్యక్తమవుతుంది. డిగ్రీ లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, దూర విద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అనర్హులవుతారు. అభ్యర్ధుల గత మార్కుల ద్వారా కాకుండా, ప్రస్తుతం నిర్వహించే పరీక్ష మెరిట్ ఆధారంగా నియామక ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు.. ఈ విషయమై గుర్తింపు సంఘం TBGKS నాయకులు సింగరేణి CMD శ్రీధర్ గారికి లేఖ రాసినట్లు ఒక ప్రకటలో తెలిపారు. అందులో 1:10 కాకుండా అప్లై చేసిన అందరికి కాల్ లెటర్ లు పంపిచాలని కోరామన్నారు.