ముంబై: ప్రయాణీకులను ఆకట్టుకోవడానికి విమానయాన సంస్థల మధ్య పోటీ మరింత తీవ్రతరమైంది. ఇప్పటికే స్పైస్‌జెట్ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్...
ముంబై: ప్రయాణీకులను ఆకట్టుకోవడానికి విమానయాన సంస్థల మధ్య పోటీ మరింత తీవ్రతరమైంది. ఇప్పటికే స్పైస్‌జెట్ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించగా, ఇదే జాబితాలోకి ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ ఇండిగో ఎయిర్‌లైన్స్ చేరింది. కనీస టికెట్ ధరను రూ.1,499గా నిర్ణయించింది. ఎంపిక చేసిన మార్గాల్లోనే ఈ ప్రత్యేక తగ్గింపు ఆఫర్ వర్తించనున్నదని తెలిపింది. ప్రయాణానికి మూడు నెలల ముందు బుకింగ్ చేసుకున్నవారికి మాత్రమే ఈ తగ్గింపు ఆఫర్ వర్తించనున్నది.