నల్గొండ: బైక్ అదుపు తప్పటంతో వెనక కూర్చున్న బానోతు ధనమ్మ(50) అనే మహిళ కిందపడి మృతి చెందింది. ఈ సంఘటన మండల సమీపంలోని తీగలచెరువు వద్ద జర...

నల్గొండ: బైక్ అదుపు తప్పటంతో వెనక కూర్చున్న బానోతు ధనమ్మ(50) అనే మహిళ కిందపడి మృతి చెందింది. ఈ సంఘటన మండల సమీపంలోని తీగలచెరువు వద్ద జరిగింది.ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న నాగయ్య అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గరిడేపల్లి మండలం గానుగబండకు చెందిన నాగయ్య బైక్పై తన అత్తగారి ఊరుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో అటువైపు వెళ్తున్న బానోతు ధనమ్మ అనే వృద్ధ మహిళను చెన్నాయపాలెం వద్ద ఎక్కించుకున్నాడు. కొద్ది దూరం వెళ్లిన తరువాత ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బైక్ అదుపుతప్పింది. గాయపడిన నాగయ్యను హుజూర్నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.