-1562లో సాగర్ నిర్మాణం -వేసవిలో శుద్ధికి సన్నాహాలు -పురాతన వస్తువులు బయటపడే అవకాశం -సర్వత్రా ఉత్కంఠ నదీ తీర...
-1562లో సాగర్ నిర్మాణం
-వేసవిలో శుద్ధికి సన్నాహాలు
-పురాతన వస్తువులు బయటపడే అవకాశం
-సర్వత్రా ఉత్కంఠ
నదీ తీరానే నాగరికతలు వెలిశాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. జీవనదిగా పేరొందిన మూసీ, మహానగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌కు ఎంతో చరిత్ర ఉంది. అయితే, చరిత్రకు ఆనవాలుగా నిలిచిన హుస్సేన్‌సాగర్ మరికొన్ని నెలల్లో చుక్కనీరు లేకుండా కనిపించనుంది. ఈ వేసవిలో చెరువులోని నీటిని పూర్తిగా తొలగించి, పూడిక తీత కార్యక్రమం చేపట్టి సుందర తటాకంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, చెరువు ఖాళీ చేస్తే అందులో నుంచి ఏం బయటపడతాయి? శతాబ్దాల క్రితం నిర్మించిన చెరువులో ఏముంటుందో? అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మా రింది. 1562లో హుస్సేన్‌సాగర్ చెరువు తవ్వకం అనంతరం ఇప్పటి వరకు ఎప్పు డూ ఖాళీగా కనిపించలేదు. 32 ఫీట్ల లో తు, 5.7 చదరపు కిలోమీటర్ల వీస్తీర్ణంలోని ఈ సరస్సు గర్భంలో దాగిన బడబానలం లాంటి నిజాలు ఎన్నో అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. సీనియర్ సిటిజన్లు, చరిత్రకారులు, నగరంతో అనుబంధం ఉన్న వారు వింత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ప్రాచుర్యంలో ఉన్న అంశాలు వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో ఎండాకాలంలో సాగర్‌ను తోడేస్తే ఏం బయటపడుతాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్.
నాలుగు తరాల నాణేలు
సాధారణంగా భారతీయ సంస్కృతిలో నదులకు పూజలు చేయడం సహజం. అందులో భాగంగా నదీమతల్లికి నాణేలు, చిల్లరను సమర్పించుకోవడం అలవాటు.ఈ క్రమంలో విగ్రహాల నిమజ్జనాలు, పూజలు ఇప్పటికే హుస్సేన్‌సాగర్‌లో నిర్వహించడం దీనిని బలపరుస్తోంది. గత 80 సంవత్సరాల నుంచి సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు బీహారీలు ఇప్పటికీ సాగరతీరంలో ఛాత్ పూజలను నిర్వహించడం తెలిసిందే. విగ్రహాలను నిమజ్జనం చేసే క్రమంలో నాణేలను వేయడం, ఛాత్పూజల్లో పూజాసామాగ్రిలో నాణేలు రావడం, అవి విగ్రహాలతోపాటు సాగర్‌లో చేరడం జరుగుతోంది. దీనికి గల కారణేలేవైనా.. హుస్సేన్‌సాగర్‌లో నాలుగు తరాల రాగి, బంగారు, వెండి, నాణేలు దొరుకుతాయని అప్పటివారు చెబుతున్నారు.
వంటపాత్రలు...
అప్పట్లో వంటలకు వినియోగించిన పాత్ర లు బయటపడుతాయన్న చర్చ కొసాగుతోంది. రాగి, ఇత్తడి, కంచు, మట్టి పాత్రలు బయటపడే అవకాశం ఉందని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. మహిళలు వస్త్రధారణకోసం వినియోగించిన ఆభరణాలు దొరుకుతాయని చెబుతున్నారు.
పోలీస్ యాక్షన్ సమయంలో...
హైదరాబాద్ మహానగర చరిత్రలో పోలీస్ యాక్షన్ ప్రధాన ఘట్టంగా చెప్పవచ్చు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం చేసే క్రమంలో చాలా మంది విలువైన వస్తువులను సాగర్‌లో వేసినట్లు ప్రచారం జరుగుతోంది.
చరిత్ర బయటడే అవకాశం
సాగర్ తవ్వకాల్లో చారిత్రక ఆధారాలు బయటపడే అవకాశాలున్నట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. పాతకాలం సామ గ్రి, బొమ్మలు, చిత్రపటాలు, కళాకృతులు బయటపడతాయన్న అంచనాలున్నాయి. ఏదేమైనా 453 ఏళ్ల అనంతరం చెరువు అడుగును చూడనున్న నేపథ్యంలో వింత లు, విశేషాలు వెలుగులోకి వస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.