కరీంనగర్: భక్తి శ్రద్ధలతో మహా శివరాత్రి పూజలు నిర్వహించడానికి ప్రజలు వేములవాడకు తరలివస్తున్నారు. రేపటినుంచి ప్రారంభం కానున్న జాతరను చూడటా...
కరీంనగర్: భక్తి శ్రద్ధలతో మహా శివరాత్రి పూజలు నిర్వహించడానికి ప్రజలు వేములవాడకు తరలివస్తున్నారు. రేపటినుంచి ప్రారంభం కానున్న జాతరను చూడటానికి దాదాపు రెండు లక్షల మంది భక్తులు వేములవాడకు చేరుకున్నారు. మంగళ వారం ప్రారంభం కానున్న జాతర మహోత్సవానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సంవత్సరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫు నుంచి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
(వేములవాడ)
(వేములవాడ)
