మధిరలో ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వండి రైల్వేమంత్రికి ఎంపీ పొంగులేటి వినతిపత్రం న్యూఢిల్లీ: ఖమ్మంలో కేరళ ఎక్స్ప్రెస్ ఆగేలా చర్య...
- మధిరలో ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వండి
- రైల్వేమంత్రికి ఎంపీ పొంగులేటి వినతిపత్రం
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల నుంచి చాలా కాలంగా ఈ డిమాండ్ ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే చాలాసార్లు ఈ అంశంపై విన్నవించామని, త్వరితగతిన దీనిపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాల్వంచ మండలం పాండురంగాపురంలోని రైల్వే స్టేషన్ గ్రామానికి 13 కి.మీ. దూరంలో అడవుల్లో ఉందని, దీనిని గ్రామానికి అందుబాటులో ఏర్పాటు చేయాలని కోరారు.
అలాగే ఖమ్మంలో కేరళ ఎక్స్ప్రెస్తో పాటు పద్మావతి ఎక్స్ప్రెస్, స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ను, మధిరలో నవజీవన్ ఎక్స్ప్రెస్, లక్నో ఎక్స్ప్రెస్, హౌరా ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని విన్నవించారు. ఎర్రుపాలెంలో శాతవాహన ఎక్స్ప్రెస్ను ఆపాలని కోరారు.
