అడిలైడ్: వరల్డ్‌కప్ వచ్చేస్తున్నది. ఫిట్నెస్ సమస్యలకు చెక్ పడాలి.. సీనియర్ పేసర్ ఇషాంత్ వైదొలిగిన షాక్ నుంచి తేరుకోవాలి.. గెలుపు పట్టా...
అడిలైడ్: వరల్డ్‌కప్ వచ్చేస్తున్నది. ఫిట్నెస్ సమస్యలకు చెక్ పడాలి.. సీనియర్ పేసర్ ఇషాంత్ వైదొలిగిన షాక్ నుంచి తేరుకోవాలి.. గెలుపు పట్టాలెక్కాలి.. కూర్పుపై ఓ అంచనాకు రావాలి. టీమ్ ఇండియా ముందున్న సవాళ్లివి! వీటన్నింటినీ రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనే సాధించగలగాలి! వరల్డ్‌కప్ కోసం తొలి ప్రాక్టీస్‌లో భారత జట్టు ఈ రోజు ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది.
అయితే డిఫెండింగ్ చాంప్‌గా తామూ రేసులో ఉన్నామని ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపాలంటే భారత్ ఈ వామప్ మ్యాచ్‌ల్లో దుమ్మురేపే ఆటను ప్రదర్శించాల్సివుంటుంది. రోహిత్ శర్మ, జడేజా, భువనేశ్వర్‌లు ఫిట్నెస్ పరీక్షలో పాసైనా, ఈ త్రయం ఏమేరకు ఫిట్‌గా ఉన్నారనే అంచనా వచ్చేది ఫీల్డ్‌లోకి దిగితేనే. కాబట్టి ఈ రెండు వామప్ మ్యాచుల్లో కళ్లన్నీ ఈ ముగ్గురిపైనే ఉంటాయి.