రాష్ట్రానికి ఇబ్బందిగా మారిన కరెంటు కోతలపై నజర్ పెట్టింది ప్రభుత్వం. రాబోయే సమ్మర్ లో ఇది మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉండడంతో.. సమస్యను ...
రాష్ట్రానికి ఇబ్బందిగా మారిన కరెంటు కోతలపై నజర్ పెట్టింది ప్రభుత్వం. రాబోయే సమ్మర్ లో ఇది మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉండడంతో.. సమస్యను తీర్చాలంటూ.. పీఎం నరేంద్రమోడీకి రెండు లెటర్లు పంపారు సీఎం కేసీఆర్. ఇపుడున్న థర్మల్ ప్లాంట్స్ తోపాటు.. విస్తరణ తరువాత ఎన్టీపీసీ అలాగే నల్లగొండ జిల్లా దామరచర్ల , సింగరేణి కాలరీస్ లో నిర్మించనున్న థర్మల్ ప్లాంట్స్ కు, బొగ్గుగనులు కేటాయించాలని లెటర్ లో కోరారు. దీంతోపాటు.. ఈస్ట్రన్ గ్రిడ్ నుంచి, రాష్ట్రానికి రావాల్సిన 5వందల మెగావాట్ల విద్యుత్ అందించాలని మరో లెటర్ రాశారు సీఎం కేసీఆర్.
మరోవైపు రాజస్థాన్ అజ్మీర్ దర్గా దగ్గర.. రాష్ట్ర ప్రభుత్వానికి రెండెకరాల స్థలం కేటాయించాలని కోరుతూ.. రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేకూ లెటర్ రాశారు సీఎం. అజ్మీర్ దర్గాకు తెలంగాణ నుంచి సంవత్సరం పొడవునా.. భక్తులు వస్తుంటారని వారి కోసం గెస్ట్ హౌస్ నిర్మించాలని.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పిన సీఎం.. ఇదే విషయంపై రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసి.. గెస్ట్ హౌజ్ నిర్మాణానికి 5 కోట్లు విడుదల చేసిన విషయాన్ని ఈ లెటర్ లో ముఖ్యమంత్రి ప్రస్తావించారు.