సూర్యాపేట: నల్లగొండ జిల్లా చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర మూడోరోజు కూడా భక్తులతో హోరెత్తింది. మంగళవారం సంప్రదాయం ...

టీడీపీకి అధికారం కల్ల: తలసాని
మోకాళ్లతో నడిచి తపస్సు చేసినా తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రాదని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి లింగమంతులస్వామి జాతరను సదర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో కొంతమంది బ్రోకర్లను నమ్ముకొని చంద్రబాబు కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణలో పట్టిన గతే ఆంధ్రప్రదేశ్‌లో కూడా పడుతుందని హెచ్చరించారు. యాదగిరిగుట్ట వలే దురాజ్‌పల్లి గుట్టను అభివృద్ధి చేస్తానన్నారు.