దేశంలోని వివిధ ప్రాంతాలలో గల ద్వాదశ జ్యోతిర్లింగాలను అవే నమూనాలతో ఏర్పాటు చేసిన బ్రహ్మకుమారీ సంస్థ కృషి ప్రశంసనీయమైనదని ఎంపీ పొంగులేటి శ...
దేశంలోని వివిధ ప్రాంతాలలో గల ద్వాదశ జ్యోతిర్లింగాలను అవే నమూనాలతో ఏర్పాటు చేసిన బ్రహ్మకుమారీ సంస్థ కృషి ప్రశంసనీయమైనదని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని టీటీడి కల్యాణ మండపంలో బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఖమ్మం శాఖ ఏర్పాటు చేసిన కైలాసగిరి, ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రదర్శనను ఆయన తిలకించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఆత్మ పరమాత్మల సందేశాన్ని చాటుతున్న సంస్థ ఆధ్యాత్మిక సేవలు మరింత విస్తృతం కావాలన్నారు. ప్రదర్శనలోని అన్ని స్టాల్స్‌ను ఆయన తిలకించారు. కార్యక్రమంలో సంస్థ ఖమ్మం శాఖ ఇన్చార్జ్ అరుణ, గీత, మాధవి, బ్రహ్మకుమారీలు, సుధాకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆకుల మూర్తి, షర్మిలాసంపత్, నిరంజన్‌రెడ్డి, సాధు రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.