తెలుగు ఎంటర్ టైన్ మెంట్ మార్కెట్ లోకి ‘స్టార్ ఇండియా గ్రూప్’ ఎంటర్ అయింది. ఇకపై స్టార్ ఇండియా ఆపరేషన్స్ లో ‘మా టీవీ’ పార్ట్ కానుంది. ఈ రె...
తెలుగు ఎంటర్ టైన్ మెంట్ మార్కెట్ లోకి ‘స్టార్ ఇండియా గ్రూప్’ ఎంటర్ అయింది. ఇకపై స్టార్ ఇండియా ఆపరేషన్స్ లో ‘మా టీవీ’ పార్ట్ కానుంది. ఈ రెండు సంస్థల మధ్య బిజినెస్ ఒప్పందం కుదిరింది. 49 శాతం ‘మాటీవీ’ షేర్స్ ని స్టార్ గ్రూప్ కొన్నది. స్టార్ సంస్థ ప్రతినిధి ఉదయ్ శంకర్ మాట్లాడుతూ, తెలుగులో ఇప్పటివరకు తమ ప్రసారాలు లేవని, అందుకే మాటీవీతో టై అప్ అయ్యామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న మేనేజ్ మెంటే ఉంటుందని, ప్రమోటర్స్ కూడా వాళ్ళే ఉంటారని చెప్పారు. రెగ్యులేటర్ పర్మిషన్స్ రాగానే ఈ డీల్ అమల్లోకి వస్తుంది. ఒప్పందం చేసుకునే ప్రోగ్రాంకి మా టీవీ సీఈఓ నిమ్మగడ్డ ప్రసాద్, పార్టనర్స్ గా ఉన్న హీరోలు నాగార్జున, చిరంజీవి అటెండయ్యారు.