ఉద్యమంగా చెరువుల పునరుద్ధరణ టీజేఏసీ ‘ఇంటరాక్షన్’లో మంత్రి హరీశ్‌రావు తెలంగాణ పునర్నిర్మాణానికి ఆయువు పట్టు:కోదండరాం ...

- టీజేఏసీ ‘ఇంటరాక్షన్’లో మంత్రి హరీశ్‌రావు
- తెలంగాణ పునర్నిర్మాణానికి ఆయువు పట్టు:కోదండరాం
- 50 లక్షల విరాళం ప్రకటించిన అడ్వొకేట్స్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి
తెలంగాణ సమాజం ఏకం కావాలి
మిషన్ కాకతీయను విజయవంతం చేయడానికి తెలంగాణ సమాజమంతా ఏకం కావాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైదరాబాద్‌లో ఉంటే విదేశంలో ఉన్నట్టుంది అన్న చంద్రబాబు ఎంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోతే... పాలన అంత సక్రమంగా సాగుతుందన్నారు. మిషన్ కాకతీయపై కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని జిల్లా జేఏసీల నుంచి సూచనలు అందాయని, మరోసారి భేటీ అయి నిర్ణయం తీసుకుంటామన్నారు. టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఉద్యోగులు కృషి చేస్తారని చెప్పారు. అడ్వొకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి మిషన్ కాకతీయకు రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తంలోరూ.25 లక్షలు వ్యక్తిగతంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఉద్యోగ జేఏసీ తరఫున ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. నీటిపారుదల శాఖ ఉద్యోగులు ఒక రోజు వేతనం ప్రకటించినట్లు చెప్పారు. తెలంగాణ ఫిల్మ్ జేఏసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి రూ.లక్ష విరాళంగా ప్రకటించి వేదికపైనే మంత్రి హరీశ్‌రావుకు చెక్కు అందించారు. చర్చల్లో పాల్గొన్న అన్ని జిల్లాల జేఏసీ చైర్మన్లు తమ జిల్లాలకు సంబంధించి సూచనలు చేశారు. కార్యక్రమంలో ఇంజనీర్ల జేఏసీ చైర్మన్ వెంకటేశ్వర్లు, హమీద్ మహ్మద్, పిట్టల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.