►టీచర్ల అక్రమ డిప్యుటేషన్లను ►నిరసిస్తూ గ్రామస్తుల ఆందోళన ►విద్యార్థులతో కలిసి బడుల ఎదుటే ధర్నా ►టీచర్లను తిరిగి రప్పించే వరకూ ఆందోళన ...

►టీచర్ల అక్రమ డిప్యుటేషన్లను
►నిరసిస్తూ గ్రామస్తుల ఆందోళన
►విద్యార్థులతో కలిసి బడుల ఎదుటే ధర్నా
►టీచర్లను తిరిగి రప్పించే వరకూ ఆందోళన చేస్తామని హెచ్చరిక
పైరవీలు చేసి.. ప్రజాప్రతినిధులతో సిఫార్సు చేయించుకుని డిప్యుటేషన్ల పేరుతో పల్లెల నుంచి పట్టణాలకు వెళ్లిన టీచర్లను వెంటనే తిరిగి రప్పించాలంటూ గ్రామీణులు ఆందోళనకు దిగారు. బడులకు తాళం వేసి తమ నిరసన తెలిపారు. అక్రమ డిప్యుటేషన్లకు సహకరించిన ప్రజాప్రతినిధులపై మండిపడ్డారు. డిప్యుటేషన్లను రద్దు చేసి వారిని తమ గ్రామాల్లోని పాఠశాలలకు పంపే వరకూ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.
జోగిపేట: డిప్యుటేషన్ పేరుతో సంగారెడ్డికి వెళ్లి పోయిన టీచర్‌ను తిరిగి తమ గ్రామానికి పంపాలని, లేకపోతే స్కూల్ మూసేయాలంటూ అందోలు మండలం రాంసానిపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మంగళవారం పాఠశాలకు తాళం వేసి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎంసీ చైర్పర్సన్ మల్లీశ్వరీ, ఉప సర్పంచ్ స్వాతి, వార్డు సభ్యులు వెంకట్లు మాట్లాడుతూ, తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 100 మంది విద్యార్థులు చదువుకుంటుండగా ప్రభుత్వం నలుగురు ఉపాధ్యాయులను కేటాయించిందన్నారు.
అయితే వారిలో ఓ టీ చర్ గత నెలలో పదవీ విరమణ పొందారని, మరొకరు ఉన్నత చదువుల నిమిత్తం సెలవుపై వెళ్లారన్నారు. దీంతో మిగిలిన ఇద్దరిలోనూ ఓ టీచర్ డిప్యుటేషన్ పేరుతో సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి పాఠశాలకు బదిలీ అయ్యారన్నారు. ఉన్న ఒక్క టీచర్
100 మందికి చదువు చెప్పడం సాధ్యం కాదు కాబట్టి పాఠశాలను మూసివేయడమే మేలన్నారు. విషయం తెలుసుకుని పాఠశాల సందర్శనకు వచ్చిన ఎంఈఓ గోపాల్‌తో గ్రామపెద్దలంతా సమావేశమయ్యారు.
ఉపాధ్యాయుల కొరత విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత నెల 27వ తేదీలోపు ఉపాధ్యాయులను నియమిస్తామన్న డీఈఓ ఆ మేరకు చర్యలు తీసుకోలేదని, అందువల్లే తమ గ్రామ పాఠశాలకు వస్తున్న అక్షయపాత్ర భోజనాన్ని కూడా వెనక్కు పంపుతున్నామన్నారు.
దీంతో స్పందించిన ఎంఈఓ గోపాల్ చదువుల నిమిత్తం వెళ్లిన టీచర్ వారం రోజుల్లోపు వస్తుందని, మిగతా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అప్పటి వరకు నేరడిగుంట పాఠశాలకు చెందిన ఒక ఉపాధ్యాయున్ని రాంసానిపల్లికి పంపుతానన్నారు. బుధవారం లోపు తమ గ్రామానికి టీచర్ రాకపోతే జాతీయ రహదారిపై ఆందోళనకు దిగుతామన్నారు.
ఆ టీచర్ డిప్యుటేషన్ రద్దు చేయండి
అల్లాదుర్గం రూరల్: ప్రజాప్రతినిధి సిఫార్సుతో డిప్యుటేషన్‌పై సంగారెడ్డికి వెళ్లిన తమ గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల టీచర్‌ను తిరిగి రప్పించాలంటూ అల్లాదుర్గం మండలం రాంపూర్ వాసులు మంగళవారం ఆందోళనకు దిగారు. టీచర్ అక్రమ డి ప్యుటేషన్ను నిరసిస్తూ పాఠశాలకు తాళం వేసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, తమ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 8 తరగతులకు నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారన్నారు.
అయితే పాఠశాలలో పనిచేసే టీచర్ ఆర్చన సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ద్వారా డీఈఓకు సిఫార్సు చేయించుకుని డిప్యుటేషన్ పేరుతో సంగారెడ్డికి బదిలీ అయ్యారన్నారు. దీంతో పాఠశాలలో విద్యాబోధన సరిగా జరగడం లేదన్నారు. అసలే ఉపాధ్యాయుల కొరత ఉంటే, ఉన్న వారినీ ఇలా డిప్యుటేషన్ చేయడంతో మరింత ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమ గ్రామం నుంచి డిప్యుటేషన్‌పై వెళ్లిపోయిన టీచర్‌ను తిరిగి తమ పాఠశాలకు పంపాలని వారంతా డిమాండ్ చేశారు. టీచర్ అర్చన డిప్యుటేషన్‌ను రద్దు చే సే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.
నేడు ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా
రాంపూర్ పాఠశాల టీచర్ అక్రమ డిప్యుటేషన్ రద్దు చేయాలనే డిమాండ్‌తో బుధవారం ఎంఈఓ కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నాకు దిగుతామని గ్రామస్తులు చెప్పారు. అప్పటి కీ జిల్లా విద్యాధికారి స్పందించకుంటే కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు.