టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్ రూరల్: టీఆర్ఎస్ పార్టీ షేరు విలువ, విలువలు పడిపోతున్న విషయాన్ని గ్రహించాలని టీడీపీ శాసనసభ ...
టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు
వరంగల్ రూరల్: టీఆర్ఎస్ పార్టీ షేరు విలువ, విలువలు పడిపోతున్న విషయాన్ని గ్రహించాలని టీడీపీ శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల సభ ను విజయవంతం చేసిన ఘనత కార్యకర్తలకే దక్కిందని ఆయన పేర్కొన్నారు. హన్మకొండలోని తన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుతో టీడీపీ కార్యకర్తలు నిరుత్సాహం తో ఉన్నారని, బాబు పర్యటనతో పార్టీ శ్రేణల్లో నూతనోత్సాహం వచ్చిందన్నారు.
బుగ్గ కార్లు పెరిగాయి తప్పా.. అభివృద్ధి లేదు..
తెలంగాణ వస్తే బాగుపడుతామని అందరూ భావించినా జిల్లాలో బుగ్గ కార్లు పెరిగాయే త ప్పా అభివృద్ధి జరగలేదని రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి వేంనరేందర్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో అధికారాన్ని కుటుంబం గుప్పిట్లో పెట్టుకున్నారని తెలిపారు. గ్రామాల్లో వాటర్ పైపులైన్లు, ట్యాంకులు మౌళిక వసతులన్ని టీడీపీ ప్రభుత్వం కట్టించిందన్నారు.
ధర్మారెడ్డి... అధర్మారెడ్డి అయ్యారు
అనామకుడైన వ్యక్తి ధర్మారెడ్డిని ఎమ్మెల్యేను చేస్తే అధర్మారెడ్డిగా మారాడని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క విమర్శించారు. తమ పార్టీలో చేరిన అధర్మారెడ్డిని ధర్మారెడ్డిగా ప్రజ లకు పరిచయం చేస్తున్న ఘనత టీఆర్ఎస్దే అన్నారు. సమావేశంలో నాయకులు ఈగ మల్లేశం, అధికార ప్రతినిధి వేం నరేందర్‌రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, మోహన్‌లాల్, ప్రసాద్‌బాబు, కార్యాలయ కార్యదర్శి మార్గం సారం గం, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఉన్నారు.