హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇవాళ ఈ వ్యాధి సోకిన కారణంగా ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు....
హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇవాళ ఈ వ్యాధి సోకిన కారణంగా ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. దీంతో ఈ సంవత్సరం జనవరి నుంచి స్వైన్‌ఫ్లూతో మృతిచెందిన వారి సంఖ్య 39కి చేరింది. ఈమేరకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక బులిటిన్ విడుదల చేసింది. గత ఆరు రోజులుగా స్వైన్‌ఫ్లూ బారిన పడుతూ వస్తోన్న వారి సంఖ్య తగ్గుతూ వస్తోందని తెలిపింది. స్వైన్‌ఫ్లూ వ్యాధి బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు కావాల్సిన మందులను జిల్లా ఆస్పత్రులు, ఏరియా హాస్పిటల్లలో అందుబాటులో ఉంచామని బులిటిన్ లో పేర్కొన్నారు.
వ్యాధి నివారణ కోసం ముందస్తుగా ఇచ్చే హోమియోపతి మందులను నిపుణుల పర్యవేక్షణలో తీసుకోవచ్చని తెలిపింది. రామాంతాపూర్‌లోని హోమియా ప్రభుత్వ వైద్యశాలతోపాటు అన్ని ఆయూష్ కేంద్రాలలో ఈ హోమియోపతి మందులు లభిస్తున్నాయని వెల్లడించింది.