సంగారెడ్డి: మెదక్ జిల్లా సంగారెడ్డిలోని పాత బస్టాండ్లో బుధవారం రాత్రి అమాయక చూపులతో కన్నీళ్లు పెడుతూ ఓ రెండేళ్ల పాప కనిపించింది. పేదరి...

కనీసం కాళ్లు కింద పెట్టరాకుండా నడవలేని స్థితిలో ఉంది ఆ చిట్టితల్లి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమివ్వగా వారు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పాప ఏమీ మాట్లాడలేకపోతోంది. ఆకుపచ్చ వర్ణపు గౌను వేసుకుంది. గౌను మీద ఐ లవ్యూ, ఐ మిస్ యూ అని రాసి ఉంది.
పాప చేతులకు వేసుకున్న గాజులు కొంచెం ఖరీదైనవే. ఇవి పాప తల్లిదండ్రులు ఎవరినైనా అడిగితెచ్చి వేశారా? పెద్దింటి వాళ్లే తమ పిల్లలు వాడి వదిలేసిన బట్టలు, గాజులు పసిపాపకు వేశారా? అనేది తేలాల్సి ఉంది. తల్లిదండ్రుల పేరు చెప్పలేకపోవడంతో పోలీసులు శిశుగృహానికి అప్పగించారు. పాపకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఆంజనేయులు తెలిపారు.