జమ్మికుంటలో సోదాల కలకలం 18 మంది అధికారులు.. 3 బృందాలు పత్తి వ్యాపారుల ఇండ్లలో తనిఖీలు పలువురి ఇళ్లలో రికార్డులు స్వాధీనం ఏడేళ్ల కిందటి...

జమ్మికుంటలో సోదాల కలకలం
18 మంది అధికారులు.. 3 బృందాలు
పత్తి వ్యాపారుల ఇండ్లలో తనిఖీలు
పలువురి ఇళ్లలో రికార్డులు స్వాధీనం
ఏడేళ్ల కిందటి కేసును తిరిగదోడుతున్న వైనం
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో 2004-07 మధ్యకాలంలో సీసీఐ పత్తి కొనుగోళ్లలో జరిగిన కుంభకోణం నిగ్గుతేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి మూడు వాహనాల్లో జమ్మికుంట చేరుకున్న 18 మంది అధికారుల మూడు బృందాలుగా విడిపోయి సోదాలు ప్రారంభించారు. సీసీఐ కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలున్న పత్తి
వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, అడ్తిదారులు, మార్కెట్, సీసీఐ అధికారులతోపాటు అప్పటి మార్కెట్ చైర్మన్ ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కొందరు అందుబాటులో లేకపోయినా ఇళ్లను సోదా చేశారు. పలు కీలక పత్రాలను, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పాత మార్కెట్ యార్డులో ప్రస్తుత ఇన్చార్జి కార్యదర్శి శివప్రసాద్ నుంచి వివరాలు సేకరించారు.
2004-07 వరకు పత్తి కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన దాడులు రాత్రి వరకు కొనసాగాయి. సీబీఐ సోదాలతో పత్తి వ్యాపారులు, మార్కెట్, సీసీఐ అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. ఈ వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని బెంబేలెత్తుతున్నారు. సోదాలకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు సీబీఐ అధికారులు నిరాకరించారు.
సాగర్రావు చొరవతో..
2004-07 మధ్యకాలంలో జమ్మికుంట మార్కెట్లో సీసీఐ పెద్ద ఎత్తున పత్తి కొనుగోళ్లు చేపట్టింది. అప్పట్లో సీసీఐ కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు పట్టణానికి చెందిన జువ్వాడి సాగర్రావు 2007లో సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు విచారణ జరిపి అక్రమాలను నిర్ధారించారు. దీనిపై సీసీఐ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. అయినప్పటికీ బాధ్యులపై సీసీఐ చర్యలు తీసుకోకపోగా, ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టింది. దీంతో సాగర్రావు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు గురువారం సీబీఐ అధికారులు రంగంలోకి దిగి అక్రమాల దొంతరలను తిరగతోడడం విశేషం.
అక్రమాలకు అంతులేదు..
ఈ సీజన్లో సైతం జమ్మికుంట మార్కెట్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రైతులు అమ్మకానికి తెచ్చిన పత్తికి నాణ్యత పేరిట కొర్రీలు పెడుతున్న వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువ ధర చెల్లిస్తున్నారు. అదే పత్తిని తిరిగి బినామీ రైతుల పేరిట సీసీఐకి మద్దతు ధరకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. ఈ వ్యవహారంపైనా సీబీఐ దృష్టి సారించాల్సిన అవసరముందని పత్తి రైతులు కోరుతున్నారు.