మారుమోగిన పెద్దగట్టు గంపల ప్రదక్షిణతోపారంభమైన దురాజ్‌పల్లి జాతర భారీగా తరలివచ్చిన భక్తులు సూర్యాపేట: తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర...

- మారుమోగిన పెద్దగట్టు
- గంపల ప్రదక్షిణతోపారంభమైన దురాజ్‌పల్లి జాతర
- భారీగా తరలివచ్చిన భక్తులు
డప్పు చప్పుళ్లు, పూనకాలు, కటార్ల ఆటలతో గ్రామస్తులు అడుగడుగునా నిండు బిందెలతో నీళ్లారబోసి దేవర దీవెనలు పొందారు. చిట్టాయపాలెం నుంచి వచ్చిన దేవరపెట్టెను కూడా వారితో పాటు పూజారులు తీసుకొచ్చారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని పెద్దగట్టుపైకి గొర్రెలు వెంట తీసుకొని దేవర విగ్రహాలను తీసుకొచ్చారు. చంద్రపట్నం వేసి పూజలు నిర్వహించారు. లింగమంతుల స్వామి, చౌడమ్మల విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠించారు. పాలు, నెయ్యితో కూడిన నైవేద్యాన్ని తయారుచేసి దేవరకు అర్పించారు. చౌడమ్మ తల్లికి తిర్మలగిరి గ్రామానికి చెందిన మున్నా వంశస్తులు మూడు గొర్రెలను బలిచ్చి పూజ విధానం ముగించారు. దీంతో జాతర ప్రారంభమైనట్లు పూజారులు ప్రకటించారు.
వాహనాల దారి మళ్లింపు: శనివారం అర్ధరాత్రి నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకు ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలను సూర్యాపేట మీదుగా అనుమతించరు. హైదరాబాద్- విజ యవాడ జాతీయ రహదారిపై దురాజ్‌పల్లి జాతర సాగుతున్నందున భక్తులకు ఇబ్బందులకు కలుగకుండా వాహనాలు దారి మళ్లిస్తున్నారు. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన బస్సులను కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా నార్కట్‌పల్లి వరకు దారి మళ్లిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వైపు నుంచి నల్లగొండ మిర్యాలగూడ, హు జూర్‌నగర్, కోదాడ మీదుగా మళ్లిస్తున్నారు.