కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకే విపక్షాలు అసత్యారోపణలు చేస్తున్నాయని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్...
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకే విపక్షాలు అసత్యారోపణలు చేస్తున్నాయని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. అద్భుతమైన పాలననందిస్తున్న కేసీఆర్ ను అభినందించాల్సింది పోయి అవమానపర్చడం దుర్మార్గమని ఆయన పేర్మొన్నారు. తమ ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలేవారికి ప్రజాకోర్టులో భంగపాటు తప్పదని ఈటెల జోస్యం చెప్పారు. విపక్షాలు ఎంతగా విమర్శించినా అవి ఆయనకు దీవెనలుగానే మారతాయన్నారు.