మంచిర్యాల టౌన్ : స్వైన్ ఫ్లూ జిల్లానూ చుట్టుముట్టింది. ఒక్కొక్కరిగా కేసులు వెలుగులోకొస్తున్నాయి. ఇప్పటికే వ్యాధి లక్షణాలతో బాసరలో ఓ యు...

మంచిర్యాల టౌన్ : స్వైన్ ఫ్లూ జిల్లానూ చుట్టుముట్టింది. ఒక్కొక్కరిగా కేసులు వెలుగులోకొస్తున్నాయి. ఇప్పటికే వ్యాధి లక్షణాలతో బాసరలో ఓ యువతి చనిపోగా.. ఇటీవల ఓ చిన్నారికి వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. తాజాగా సోమవారం కాసిపేట మండలానికి చెందిన మరో మహిళకు కూడా స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది. కాసిపేట మండలం రొట్టపల్లి గ్రామానికి చెందిన పోగుల సరోజ కుమారుడు పవన్‌కల్యాణ్‌కు తీవ్ర జ్వరం రావడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి గత నెల 27న తీసుకొచ్చింది. కుమారుడితోపాటే ఆస్పత్రిలో ఉన్న సరోజ తీవ్ర జలుబు, దగ్గు, జ్వరం బారిన పడింది. దీంతో 31వ తేదీన బాధితురాలి వ్యాధిపై అనుమానాలు వచ్చి ఆస్పత్రి సూపరింటెండెంట్ నీలకంఠేశ్వర్రావు వెంటనే రక్తనమూనాలు సేకరించారు.
వాటిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. కాగా.. సోమవారం వాటికి సంబంధించిన రిపోర్టులో పాజిటివ్‌గా వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సరోజనను ఆస్పత్రిలో చేర్చి ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చి ఆమెను పరామర్శించారు. బాధితురాలికి మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులకు సూచించారు. కాగా.. తూర్పు జిల్లా పరిధిలో ఇప్పటివరకు రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంతకుముందు మందమర్రి విద్యానగర్‌కు చెందిన చిన్నారి వానరాసి లలితకి వ్యాధి నిర్ధారణ అయ్యింది.

టాగ్లు: స్వైన్ ఫ్లూ నిర్ధారణ, Swine Flu diagnosed