-సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు -పాల్గొన్న సింగరేణి అధికారులు, ఉద్యోగులు కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి ...
-సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు
-పాల్గొన్న సింగరేణి అధికారులు, ఉద్యోగులు
కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 17 : తెలంగాణ రాష్ర్టాన్ని ఏ మార్గం ద్వారానైతే సాధించి తెలంగాణ ప్రజల చిరకాల సప్నాన్ని సాకారం చేశారో, అదే మార్గంలో బంగారు తెలంగాణను కూడా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్మాణం చేసి చూపిస్తారని, నిరంతర శ్రామికునిగా సీఎం కేసీఆర్‌కు తిరుగు లేదని సింగరేణి అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ నాయకులు అన్నారు. మంగళవారం సాయంత్రం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదురుగా సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు సారథ్యంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సింగరేణిలోని వివిధ శాఖల జనరల్ మేనేజర్లు ఏ. ఆనందరావు, ఎం. శివరామిరెడ్డి, సాంబశివరావు, నాగేశ్వరరావు, బాల్‌రెడ్డి, సింగరేణి అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు గీతామోహన్, జాయింట్ సెక్రటరీ మధుబాబు, పంతంగి మోహన్‌రావు, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కనకరాజు, టీఆర్ఎస్ ముఖ్య నేతలు జీవీకే మనోహర్, కంచర్ల చంద్రశేఖర్, ఆళ్ల మురళీ, తెలంగాణ శ్రీనివాస్‌లు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంతో పాటు దక్షిణ భారత దేశంలోనే ఏకైక బొగ్గు ఉత్పాదన పరిశ్రమగా ఉన్న సింగరేణి సంస్థపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద కనపరుస్తున్నారన్నారు. సింగరేణికి సీఎం కేసీఆర్ ఆశాకిరణం లాంటివారన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ సమయంలోనే సింగరేణి కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్‌ను మంజూరు చేశారన్నారు.
ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో సింగరేణికి మాత్రమే తొలి ఇంక్రిమెంట్‌ను మంజూరు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్‌కి ఉన్న అవగాహన సింగరేణిపై ఏ ఇతర పార్టీల అగ్రనేతలకు లేదన్నారు. సింగరేణి డైరెక్టర్ పా, ఫైనాన్స్ ఎస్. వివేకానంద్ ప్రత్యేక సందేశాన్ని పం పారు. ఆ సందేశాన్ని తెలంగాణ శ్రీనివాస్ చదివి వినిపించారు. సీఎం కేసీఆర్ సింగరే ణి సంస్థను దేశ, విదేశాల్లో విస్తరించేందుకు, అంతర్జాతీయ సంస్థగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నారని ఆ సందేశంలో పేర్కొన్నారు. డైనమిక్ సీఎండీని నియమించి సింగరేణిని ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారన్నారు. భగవంతుడు ఆ యనకు శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నా రు.
ఈ సందర్భంగా సర్వమత పండితులు పాస్టర్ రెవరెండ్ పాల్, మహ్మద్ రహీస్ అహ్మద్, హరిహర వేదవిద్యాపీఠం పండితుడు నవీన్‌కుమార్ శర్మలు మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి కనీవిని ఎరుగని రీతిలో సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నారన్నారు. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలను, రాష్ర్టానికి, ప్రజలకు మేలు చేసే విధంగా శక్తి సామర్థ్యాలను, మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. వేద పండితులు మంగళశాసనాలతో ఆశీర్వచనాలను పటించారు.
సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం...
సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదురుగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడంతో పాటు కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. సింగరేణి జీఎంలు పి. ఉమామహేశ్వరరావు,రామభద్రిరా జు, కేకే శర్మ, వెంకటేశ్వర్‌రెడ్డి, రవి శంకర్, డీవైపీఎం ఆర్వీ సత్యనారాయణ, సీఎంవోఏఐ కార్యదర్శి రాజీవ్‌కుమార్, కమ్యూనికేషన్ సెల్ విభాగం ఇన్చార్జి కేవీ రమణ, అల్లి శంకర్, టీబీజీకేఎస్ ముఖ్య నేతలు ఆర్. కొమరయ్య, సంగం చందర్, సంగాల పద్మారా వు, కాపు కృష్ణ, బందెల విజేందర్, డప్పు కుమార్, స్వామి, గౌస్, మల్లీశ్వరి, అన్నపూర్ణ, ఉష, వినోద, అరుణ కుమారి, నిర్మలాదేవి, శైలజ, వజ్రమ్మ, ఏ. రాములు, చిలుక రాజ య్య, రాజేశ్వరరావు, పొదిల శ్రీనివాస్, కే. రాంచందర్, బోరింగ్ శంకర్, యాదగిరి, అజీజ్ అహ్మద్, బొద్దుల సత్యనారాయణ, రవీందర్, సింగరేణి ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. మాధవ్‌నాయక్, టీఆర్ఎస్ ముఖ్య నేతలు అక్బర్, తూము వెంకటేశ్వర చౌదరి, ఆబీద్ హుస్సేన్, ఇమ్రాన్, ఎండీ హుస్సేన్ పాల్గొన్నారు.