మెల్బోర్న్: పాలపుంతలో నక్షత్రాల చుట్టూ భూమిని పోలిన కోటానుకోట్ల గ్రహాలున్నాయని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్‌యూ) తాజా పరిశోధ...
మెల్బోర్న్: పాలపుంతలో నక్షత్రాల చుట్టూ భూమిని పోలిన కోటానుకోట్ల గ్రహాలున్నాయని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్‌యూ) తాజా పరిశోధనలో వెల్లడైంది. ఆ గ్రహాల్లో మానవ జీవనానికి అనుకూలంగా ఉండే వాతావరణ పరిస్థితులున్నాయని ఏఎన్‌యూ పరిశోధక విద్యార్థి, అధ్యాపక బృందం భావిస్తున్నది. 200 ఏండ్ల క్రితం కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఎక్సో-ప్లానెట్ను నాసా కనుగొన్న విధానాన్నే ఏఎన్‌యూ అవలంబించనున్నది. గోల్డిలాక్స్ జోన్‌గా వ్యవహరించే రెండు గ్రహాల్లో మానవజీవనానికి అనువైన వాతావరణం, తాగునీరు పుష్కలంగా ఉన్న ఓ ప్రామాణికమైన నక్షత్రాన్ని గుర్తించారు. ఆ గ్రహాల్లో కనిపించే దృశ్యాలను చూసేందుకు, శబ్దాలను వినేందుకు రేడియో టెలిస్కోపులను, స్పేస్ షిప్‌లను రూపొందిస్తున్నామన్నారు.