ఇచ్చోడ: జలుబు, దగ్గు ఉందని ప్రైవేటు వైద్యు డి వద్దకు పోతే, మా కొడుకు ప్రాణం తీశాడు. ఏదో సూది ఇచ్చి పొట్టన బెట్టుకున్నాడు అని ఆరోపిస్తూ ...
ఇచ్చోడ: జలుబు, దగ్గు ఉందని ప్రైవేటు వైద్యు డి వద్దకు పోతే, మా కొడుకు ప్రాణం తీశాడు. ఏదో సూది ఇచ్చి పొట్టన బెట్టుకున్నాడు అని ఆరోపిస్తూ ఆ బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆ వైద్యుడు పారిపోవడంతో ఠాణాలో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశా రు.. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బూతాయి(బి) గ్రామానికి చెందిన కుందల్సింగ్ కుమారుడు ముఖేశ్ (2), శనివారం సాయంత్రం జలు బు, దగ్గుతో బాధపడుతున్నాడు.
అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు మాదవ్, 12 కిలోమీటర్ల దూరంలోని బజార్హత్నూర్లో ప్రైవేట్ క్లినిక్ ఏర్పాటు చేసుకున్నాడు. కుందల్సింగ్ తన కొడుకును తీసుకొని వైద్యం కోసం వెళ్లగా, మాదవ్ ఓ ఇంజక్షన్ ఇచ్చి, జలుపు, దగ్గు తగ్గిపోతుందని చెప్పి పంపించాడు. ఇంటికి వెళ్తుండగా, మార్గ మధ్యలో ఆ బాలుడు ఆపరస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇంటికి వెళ్లే సరికి పరిస్థితి విషమంగా మారడంతో, వెంటనే వైద్యుడు మాధవ్ వద్దకు కుటుం బ సభ్యులు తీసుకవచ్చారు. అక్కడ ఆ వైద్యుడు లేకపోవడంతో, మరో వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యుడు తెలపడంతో, విషయం తెలిసిన మాధవ్ పారిపోయాడు. వెంటనే కుటుం బ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు బజార్హత్నూర్ ఎస్ చంద్రశేఖర్ తెలిపారు.