వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి తెలకపల్లి : ప్రస్తుతం జిల్లాలో కరువు పరిస్థితి తాండవించిందని, రైతులు అ...

వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి
తెలకపల్లి : ప్రస్తుతం జిల్లాలో కరువు పరిస్థితి తాండవించిందని, రైతులు అప్పులబాధలో కూరుకుపోయి పశువులను సైతం కోతలకు అమ్ముకుంటున్నారని, అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి కోరారు. సోమవారం ఆయన వైఎస్ఆర్ సీపీ నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ఇన్చార్జి భగవంత్రెడ్డితో కలిసి తెలకపల్లి సంతను సందర్శించారు. పలువురి రైతుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని, వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు పండక బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
పశువులకు మేత, నీళ్లులేక రైతులు కోతకు అమ్ముకుంటున్నారని వాపోయారు. వీటి నివారణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎడ్మ డిమాండ్ చేశారు. రైతుల బాధలు, వివరాలు సేకరిస్తున్నామని, ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. తాము సేకరించిన రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు.
రైతులతో ముఖాముఖి
ఈ సందర్భంగా ఎడ్మ కిష్టారెడ్డి పలువురు రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. దేశియిటిక్యాల గ్రామానికి చెందిన చంద్రయ్య, ఇంద్రకల్‌కు చెందిన రైతు బాల్నాగయ్య బాధలు అడిగారు. పశువులను వధశాలకు ఎందుకు విక్రయిస్తున్నారని ప్రశ్నించడంతో.. ఈ ఏడాది వర్షాలు సరిగా లేవని, పంటలు పండకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయామని అన్నదాతలు తమ ఆవేదనను వివరించారు. కొంత అప్పులైనా తీరుతాయని పశువులను అమ్ముకుంటున్నామని రైతులు ఎడ్మ కిష్టారెడ్డితో మొరపెట్టుకున్నారు. వారి వెంట వైఎస్ఆర్ సీపీ యూత్ నాయకులు వంశీచందర్‌రెడ్డి, యుగేందర్ తదితరులు ఉన్నారు.