ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఖమ్మం వైరారోడ్: టీడీపీ నాయకులకు మతిభ్రమించింద ని, తెలంగాణలో టీడీపీ భూ స్థాపితం కావడం ఖాయమని టీఆర్ఎస్ నేత...
ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ
ఖమ్మం వైరారోడ్: టీడీపీ నాయకులకు మతిభ్రమించింద ని, తెలంగాణలో టీడీపీ భూ స్థాపితం కావడం ఖాయమని టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం స్థానిక తుమ్మల క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ నాయకులకు మతిభ్రమించి టీఆర్ఎస్పై బురద జల్లుతున్నారని, ప్రజలు దీనిని గమనిస్తున్నారని అన్నారు.
ఆ పార్టీ సంస్థాగతంగా ఏర్పాటు చేసుకున్న సమావేశంలో దానిపైనే దృష్టి పెట్టాలే తప్ప అనవసర విషయూలు మాట్లాడి పరువు పోగొట్టుకోవద్దని సూచించారు. తాము అవకాశ వాదంతో పార్టీ మారలేదని, టీడీపీని ఏ సందర్భంలో వీడామో ప్రజలందరికీ తెలుసునని, ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరంలేదని అన్నారు. టికెట్ ఇచ్చి లాక్కున్నా తాము టీడీపీలో కొనసాగినం త కాలం పార్టీ అభ్యర్థి విజయం కోసమే కృషి చేశామని, ఏ రోజు పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థిని కాదని జెండాలు, ఫొటోలు తగులబెట్టలేదని, అటువంటి చర్యలకు పాల్పడిన వ్యక్తి ఆ పార్టీకి జిల్లా అధ్యక్షుడా అంటూ ఉన్నం బ్రహ్మయ్యనుద్దేశించి వ్యాఖ్యానించారు.
ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోరుునంత మాత్రాన జీవితా న్ని ఇచ్చిన సీపీఎంను వీడి టీడీపీలోకి ఎలా వెళ్లావంటూ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ప్రశ్నించారు. నేడు టీడీపీలో కొనసాగే వారంతా పచ్చి అవకాశవాదులని ఆరోపించారు. త్వరలో జరుగనున్న కార్పొరేషన్ ఎ న్నికల్లో ఎవరి బలమెంతో తెలుస్తుందని, అప్పు డే మాట్లాడుకోవచ్చని, ఇప్పటి వరకు సహనంతో ఊరుకుంటున్నామని, ఇకపై నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
జిల్లాలో మూడు లక్షల సభ్యత్వాలు నమోదు లక్ష్యం కాగా ఇప్పటికే నాలుగు లక్షలు నమోదయ్యూయని, రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉందని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయ్యడానికి టీడీపీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఖమ్మం, మధిర నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ఆర్జేసీ కృష్ణ, బొమ్మెర రామ్మూర్తి, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, నల్లమల వెంకటేశ్వరరావు, బోడేపుడి రమేష్‌బాబు, పులిపాటి ప్రసాద్, చింతనిప్పు కృష్ణచైతన్య, కమర్తపు మురళి, కూసూరి రమేష్‌గౌడ్, ఖాదర్‌బాబా పాల్గొన్నారు.