కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహిస్తున్న తెలంగాణ స్థాయి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ శనివారానికి నాలుగో రోజుకు చేరుకుంది. సో...

శుక్రవారం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న సోల్జర్ జనరల్ డ్యూటీ అభ్యర్థులకు శనివారం శరీరధారుడ్య పరీక్షలు నిర్వహించారు. 3,689 మంది అభ్యర్థులు శరీర దారుఢ్య పరీక్షల్లో పాల్గొనగా స్క్రీనింగ్ అనంతరం 741 మంది వైద్య పరీక్షలకు ఎంపికయ్యారు. నాలుగురోజుల్లో నిర్వహించిన సోల్జర్ టెక్నికల్, సోల్జర్ క్లర్క్, సోల్జర్ జనరల్ డ్యూటీ విభాగాల ఎంపికలకు సుమారు 21 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆదివారం సోల్జర్ ట్రేడ్స్మన్ విభాగంలో 10 జిల్లాల అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు.