దండేపల్లి: మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం, ద్వారక, గుడిరేవు, కాసిపేట, వెల్గనూర్ గ్రామాల్లోని ...
దండేపల్లి: మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం, ద్వారక, గుడిరేవు, కాసిపేట, వెల్గనూర్ గ్రామాల్లోని గోదావరి నదీ తీరాలు మంగళవారం భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. భక్తులు ఉదయాన్నే నదీతీరాలకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం సమీపంలోని ఆలయాల్లో పూజలు నిర్వహించారు.
అయితే, కాసిపేట, వెల్గనూర్లో గోదావరిలో సరిపడ నీళ్లు లేక భక్తులు ఇబ్బందులు పడ్డారు. కడెం ప్రాజెక్టు నుంచి నీరు వదిలినప్పటికీ అవి ఇక్కడివరకు చేరుకోకపోవడంతో స్నానాలకు నీటి కొతర ఏర్పడింది.
అయితే, కాసిపేట, వెల్గనూర్లో గోదావరిలో సరిపడ నీళ్లు లేక భక్తులు ఇబ్బందులు పడ్డారు. కడెం ప్రాజెక్టు నుంచి నీరు వదిలినప్పటికీ అవి ఇక్కడివరకు చేరుకోకపోవడంతో స్నానాలకు నీటి కొతర ఏర్పడింది.
