ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారుల క్రేజ్ హైదరాబాద్: ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్...

హైదరాబాద్: ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కొత్త సిరీస్ వేలం పాటల్లో పలు నంబర్లు రూ.లక్షలు కురిపించాయి. నగరంలోని లహరి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థ రూ.63.34 లక్షల విలువైన ఆడి క్యూ7 కారు కోసం ‘టిఎస్ 09 ఈఈ 0999’ నంబర్‌ను వేలంలో దక్కించుకొంది. దీని కోసం రూ.2,98,770 చెల్లించారు.
అలాగే చిరంజీవి తనయుడు, హీరో రాంచరణ్‌తేజ్ రూ.1.14 కోట్ల విలువైన ల్యాండ్ క్రూజర్ వాహనం ‘టీఎస్ 09 ఈఈ 1111’ను దక్కించుకున్నారు. ఈ నంబర్ కోసం ఆయన రూ.1,15,060 చెల్లించారు. ‘టీఎస్ 09 ఈఈ 1122’ కోసం లక్ష్మీ సరస్వతి అనే వాహనదారు రూ.86,050, ‘టీఎస్09 ఈఈ 0909’ కోసం డాక్టర్ మీరా రాజ్‌గోపాల్ రూ.66050 చెల్లించారు. మొత్తంగా సోమవారం నిర్వహించిన వేలం పాటల్లో ఖైరతాబాద్ ఆర్టీఏకు రూ.8,39,224 ఆదాయం లభించినట్లు ప్రాంతీయ రవాణా అధికారి జీపీఎన్ ప్రసాద్ తెలిపారు.