పోలీస్‌శాఖలో సంస్కరణల పర్వం కొనసాగుతోంది. ఈ శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌స్థాయి ఉద్యోగి నుంచి పోలీస్ సబ్‌డివిజనల్ స్థాయి అధికారుల ...

పోలీస్‌శాఖలో సంస్కరణల పర్వం కొనసాగుతోంది. ఈ శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌స్థాయి ఉద్యోగి నుంచి పోలీస్ సబ్‌డివిజనల్ స్థాయి అధికారుల వరకు జవాబుదారీ తనాన్ని పెంపొందించేందుకు జిల్లా పోలీస్‌శాఖ వినూత్నరీతిలో పనివిభజన చేపట్టింది. జిల్లాలో పెరుగుతున్న నేరాలను అరికట్టడంతోపాటు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే ప్రతి చిన్న అంశం వారి దృష్టికి వచ్చేలా పోలీస్‌శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే జిల్లా ఎస్పీ షానవాజ్‌ఖాసిం ఈ తరహా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తొలుత హైదరాబాద్ కమిషనరేట్ తరహాలో ప్రతి విభాగానికి ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. నేర నియంత్రణ కోసం ప్రతి స్టేషన్‌కు ప్రత్యేకంగా ఎస్సై స్థాయి అధికారిని నియమించారు.
పకడ్బందీగా..
పోలీస్‌శాఖ పకడ్బందీగా ముందుకెళ్తోంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సంఘటనలు తక్షణం తెలియడం, దొంగతనాల నియంత్రణ, ఆకతాయిల సంచారం, వైట్‌కాలర్ నేరాలను అరికట్టడం కోసం ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు ఒకొక్క కానిస్టేబుల్, అలాగే నగరంలో ప్రతి వార్డుకు ఓ కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సైలను కలిపి ఒక బృందంగా ఏర్పాటు చేశారు. ఆ వార్డుకు ఇన్చార్జిగా నియమించారు. ప్రతిరోజు తమకు అప్పగించిన గ్రామాలు, వార్డుల్లో క్రమం తప్పకుండా సిబ్బంది తిరుగుతూ ఉండాలి. అసాంఘిక శక్తులు, నేర చరితుల కదలికపలై నిఘా ఉంచాలి. దీని ద్వారా చిన్న చిన్న తగాదాలకు కూడా ఆయా ప్రాంతాల్లో అవకాశం లేకుండా చేయాలని సంకల్పించారు.
పని విభజన
జిల్లాలోని 53 పోలీస్స్టేషన్లలో కొద్దిరోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. పోలీస్స్టేషన్లకు డ్యూటీ నిమిత్తం కానిస్టేబుల్ రిపోర్టు చేయగానే ఆ రోజు తాను చేయాల్సిన పనికి సంబంధించిన దినచర్యను సదరు కానిస్టేబుల్ డైరీలో నమోదు చేసుకునే ప్రక్రియను జిల్లాలో విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రతి కానిస్టేబుల్ డైరీ రాసే విధానాన్ని అవలంబించేలా ఆయా పోలీస్‌స్టేషన్‌లోని ఎస్సై, సీఐ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఏరోజు ఏ డ్యూటీకి వెళ్లారు, అందులో తాము సాధించిన ప్రగతి ఏమిటి..?, తెలుసుకున్న అంశాలేమిటి, పెండింగ్ కేసులకు సంబంధించి తమకు అప్పగించిన పనుల్లో సాధించిన పురోగతిని ఆయా కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్సై స్థాయి అధికారులు డైరీల్లో నమోదు చేస్తున్నారు. వీరు రాసిన డైరీ, దినచర్య వివరాలను ప్రతి శనివారం ఇంటెలిజెన్స్ మీటింగ్ పేరుతో సంబంధిత ఎస్‌హెచ్‌వో సీఐ, ఎస్సై స్థాయి అధికారులు పరిశీలిస్తున్నారు.
ఆ వారంలో ఆయా ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు, నేర నియంత్రణకు జరుగుతున్న కృషి, ముందస్తుగా తీసుకున్న చర్యలను పరిశీలిస్తున్నారు. ఒకవేళ సంబంధిత వార్డులో ఏదైనా నేరం జరిగితే మాత్రం ఆ వార్డుకు ఇన్చార్జిలుగా ఉన్న కానిస్టేబుల్ నుంచి హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సై స్థాయి ఉద్యోగులను బాధ్యులను చేస్తూ వారికి చార్జ్‌మెమోలు ఇచ్చే పద్ధతి సైతం కొనసాగుతోంది. దీనివల్ల కానిస్టేబుళ్లలో కొంత జవాబుదారీతనం పెరిగిందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కొందరు సిబ్బందిలో మాత్రం తమపై ఒత్తిడి పెంచడానికే ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని, అన్ని సందర్భాల్లో తమ దినచర్యను డైరీలో నమోదు చేయడం కష్టసాధ్యమవుతోందని సంబంధిత అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కొన్నిచోట్ల నామమాత్రంగా డైరీ నమోదు
మండల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎన్ని గ్రామాలున్నాయో అంతమంది కానిస్టేబుల్స్‌కు అందుబాటులో ఉన్నంత వరకు హెడ్‌కానిస్టేబుల్స్, ఏఎస్సైలకు ఆ గ్రామ బాధ్యతలను అప్పగించారు. పట్టణప్రాంతాల్లోనూ, ఖమ్మం నగర ప్రాంతంలోనూ ఈ బాధ్యతలను బీట్ల వారీగా, మున్సిపల్ వార్డుల వారీగా విభజించారు. రోజువారీగా దినచర్య నమోదు చేయడం, పోలీస్‌సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం అందుబాటులో ఉండటం వల్ల ప్రజల్లో కొంత భద్రతా భావం పెంపొందించడంతోపాటు చిన్నచిన్న నేరాల సంఖ్య తగ్గిందన్న అభిప్రాయం పోలీస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే కొన్ని పోలీస్స్టేషన్లలో మాత్రం డైరీ పరిశీలన నామమాత్రంగా జరుగుతోందన్న భావన వ్యక్తం అవుతోంది. పోలీస్ సిబ్బంది రూపొందించిన డైరీ ఆధారంగానే వారి పనితీరును పోలీస్ అధికారులు అంచనా వేసేందుకు ఈ ప్రకియ ఉపయోగపడుతుందని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.